హైదరాబాద్

నిమజ్జన ఊరేగింపులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, సెప్టెంబర్ 15: సామూహిక నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న వాహనంపై ఉన్న వారు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిగా మరొకరు విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చంపాపేట రెడ్డికాలనీలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం నుండి బుధవారం రాత్రి సరూర్‌నగర్ చెరువులో గణేశ్ నిమజ్జనానికి నిర్వాహకులు ట్రాక్టర్‌లో ఊరేగింపుగా బయలు దేరారు. అంతకు ముందు కురిసిన భారీ వర్షానికి కాలనీలో రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఊరేగింపుకొద్దిగా ముందుకు వెళ్లిన తరువాత విగ్రహానికి పైన అడ్డుగా విద్యుత్ తీగలు రావడంతో వాహనంపై ఉన్న నిర్వాహకుడు ఆవైర్లను ఒక కర్రతో పైకి జరిపే ప్రయత్నం చేశారు. వర్షపు నీటితో కర్ర తడిసి ఉండడం పైన ఉన్న రెండు విద్యుత్ తీగలు ఒకే సారి కలవడంతో ఒక్కసారిగా విద్యదాఘాతం తగిలి వాహనంలో ఉన్న వారు పైనుండి రోడ్డుపై పడి వర్షపునీటిలో కొద్ది దూరం కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇదే కాలనీకి చెందిన న్యాయవాది వెంకటేశ్వర్ సింహగౌడ్(38) మృతి చెందాడు. ఆయనకు భార్య శే్వత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇదే ప్రమాదంలో పిఅండ్‌టి కాలనీకి చెందిన శ్రీరాంరెడ్డి కుమారుడు పటోళ్ల సందీప్‌రెడ్డి(22) మృతి చెందారు. సందీప్‌రెడ్డి ఎంవిఎస్‌ఆర్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడు సందీప్‌రెడ్డి మేనమామ రఘువీర్‌రెడ్డి(30) తీవ్ర గాయాలతో కోమాలోకి చేరుకున్నాడు. అతనిని చికిత్స నిమిత్తం అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్మన్‌ఘాట్‌లో నివసించే రఘువీర్ మైండ్ స్పేస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంలో నిర్వాహకుడు వెంకటేశ్‌గౌడ్, భాస్కర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్సవ వేళ జరిగిన విషాదంతో చంపాపేట్, పిఅండ్‌టి కాలనీలలో మృతుల ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.