హైదరాబాద్

గంటన్నర వ ర్షం.. గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన జీవనం అస్తవ్యస్తం చెరువులను తలపించిన రహదారులు
పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఫ్లైఓవర్లపై గంటలకొద్దీ స్తంభించిన ట్రాఫిక్
కిలోమీటరు ప్రయాణానికి మూడుగంటలు
లోతట్టుప్రాంతాలు, రోడ్లు జలమయం నీటితో జంక్షన్లు జామ్..వాహనదారులకు ఇక్కట్లు
బంజారాహిల్స్‌లో కూలిన దోభీఘాట్ గోడ పది బైక్‌లు..రెండు కార్లు ధ్వంసం

హైదరాబాద్, సెప్టెంబర్ 16: మహానగరంలో మరో సారి భారీ వర్షం కురిసింది. రెండురోజుల క్రితం ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున సంగతి తెలిసిందే! శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి భారీ వర్షం కురవటంతో నగరం అతలాకుతలమైంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిల్చిపోయింది.
నిత్యం రద్ధీగా ఉండే ఖైరతాబాద్, లక్డీకాపూల్, నానల్‌నగర్, సోమాజీగూడ, పంజాగుట్ట, రాణిగంజ్ చౌరస్తా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకుట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలీ, మణికొండ, ఖైరతాబాద్, కోఠి, నారాయణగూడ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లోని కూడళ్లులో భారీగా వర్షపు నీరు నిల్వవటంతో చెరువులను తలపించాయి. ఇక మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా గుంతలమయం కావటంతో పాటు ట్రాఫిక్ నియంత్రించే వారు లేకపోవటంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం దాదాపు గంటర్ననర నుంచి రెండు గంటల పాటు దంచికొట్టడటంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ అధికారులను అప్రమత్తం చేశారు. కేవలం గంటన్నర వర్షానికే నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లోని సాయిబాబా ఆలయం వీధిలో కొద్దిరోజులుగా డ్రైనేజీ సమస్య ఉండటంతో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగిప్రవహించాయి. యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేయటంతో ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. వర్షం కురస్తున్నపుడు, కురిసిన తర్వాత కూడా ఫ్లై ఓవర్లపై గంటల తరబడి ట్రాఫిక్ నిల్చిపోయింది. మాసాబ్‌ట్యాంక్, బేగంపేట ఫ్లై ఓవర్లకు ఇరువైపులా సుమారు మూడు అడుగుల ఎత్తుతో ప్రహరీగోడలున్నా, వాహనాలు ప్రయాణిస్తున్నపుడు వర్షపు నీరు కిందకు పడిందంటే వర్షం ఎంత స్థాయిలో దంచికొట్టిందో అంచనా వేసుకోవచ్చు. బేగంపేట, తెలుగుతల్లి, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్‌తో పాటు పివిఎన్ ఎక్స్‌ప్రెస్ వే పై ట్రాఫిక్ స్తంభించింది. పివిఎన్ ఎక్స్‌ప్రెస్ వేపై నాలుగు కార్లు ఢీ కొట్టడంతో గాయాలపాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా దాదాపు అరగంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. జిహెచ్‌ఎంసి అధికారులు ఇదివరకే గుర్తించిన సుమారు వాటర్ స్టాగినేషన్ పాయింట్లతో అదనంగా మరికొన్ని కూడళ్లలో భారీగా వర్షపు నీరు నిలిచినా, కనీసం నీటిని తోడేసే చర్యలు కూడా చేపట్టకపోవటం పట్ల వాహనదారులు తీవ్రంగా మండిపడ్డారు. సాయంత్రం ఆఫీసు సమయానికి వర్షం కురవటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. కొన్ని చోట్ల కనీసం నిల్చుండేందుకు బస్టాపులు కూడా లేకపోవటంతో వారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, రాణిగంజ్, నాంపల్లి, ఎంజె.మార్కెట్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాల సైలన్సర్‌లోకి నీరు ప్రవహించటంతో పదుల సంఖ్య వాహనాలు మొరాయించటం కన్పించింది. ఈ కింద పేర్కొన్న ప్రధాన రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నట్లు అధికారులు నగరాన్ని వరదలు ముంచెత్తిన 2000 సంవత్సరం నుంచే చెబుతూ వస్తున్నారే తప్పా, శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చటంలో పాలకులు, అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.
ట్రాఫిక్ జాం అయిన ప్రాంతాలు
* విఐపి జోన్‌లోని లక్డీకాపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్ ముందు భారీగా వర్షపు నీరు నిల్వటంతో ఏజి ఆఫీసు నుంచి మాసాబ్‌ట్యాంక్ వైపు వస్తున్న వాహనాలు అట్టు సచివాలయం వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి.
* మహావీర్ ఆసుపత్రి, హోటల్ ఉడ్‌బ్రిడ్జి ముందు భారీగా వర్షపు నీరు నిల్వటంతో మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ పై, కింద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
* ఇక వర్షం కురవటం ప్రారంభం కాగానే నాలుగు గంటల నుంచే ఖైరతాబాద్ జంక్షన్‌లో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది. ఈ ప్రభావంతో అటు లక్డీకాపూల్ సంత్‌నిరంకారి భవన్, అటు ద్వారకా హోటల్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ నిల్చిపోయింది. అలాగే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ మీదుగా నిమ్స్ ముందు, పంజాగుట్ట చౌరస్తా వరకు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింపోయింది.
* ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వెళ్లే రహదారి, అలాగే నిమ్స్ ముందు మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా నెక్లెస్‌రోడ్డు, ఖైరతాబాద్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, పంజాగుట్ట జంక్షన్లలో వాహనాలు నిల్చిపోయాయి.
* తెలుగుతల్లి ఫై ఓవర్‌పై సికిందరాబాద్ వైపు వచ్చే మార్గంలో అరగంట వరకు ట్రాఫిక్ స్తంభించినా, లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ దేవాలయం ముందు నుంచి సచివాలయం, మాసాబ్‌ట్యాంక్ వెళ్లే దారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిల్చిపోయింది.
* బంజారాహిల్స్ జివికె 1 నుంచి అటు నాగార్జున సర్కిల్‌కు, అలాగే ఇటు మాసాబ్‌ట్యాంక్ చౌరస్తా వరకు, అలాగే జివికె ముందున్న వాటర్ వర్క్స్ పంప్ హౌజ్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 3కు వెళ్లే దారిలో వాహనాలు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి.
* కెబిఆర్ పార్కు నుంచి నాగార్జున సర్కిల్- పంజాగుట్ట ఫ్లైఓవర్-సిఎం క్యాంపు కార్యాలయం-బేగంపేట పబ్లిక్ స్కూల్-బేగంపేట ఫ్లై ఓవర్ కింద, పైన-పాత ఎయిర్‌పోర్టు- బేగంపేట ఆనంద్ ధియేటర్ ముందు నుంచే ప్రారంభమైన సికిందరాబాద్ ఫ్లై ఓవర్లపై దాదాపు రెండు గంటల పాటు ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయి, వాహనదారులకు చుక్కలు చూపించాయి.
* మెట్రోరైలు పనులు జరుగుతున్న పంజాగుట్టచౌరస్తా, నాంపల్లి, ఎంజె.మార్కెట్, అశోక్ హోటల్, సికిందరాబాద్, బోయిగూడ, గాంధీ ఆసుపత్రి ముందు నుంచి ఆర్టీసి క్రాస్‌రోడ్డు, కల్పనా ధియేటర్-వైస్రాయ్ చౌరస్తా వరకు ట్రాఫిక్ స్తంభించింది.
* ఇక వర్షం కురిసిన నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అప్పర్‌ట్యాంక్‌బండ్‌పై ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి. ద్విచక్ర వాహనదారుల ఇబ్బందులు వర్ణణాతీతం.
* అమీర్‌పేట మైత్రివనం ముందు భారీగా వర్షపు నీరు నిల్వటంతో అటు ఎస్‌ఆర్‌నగర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్లాల్సిన వాహనాలు పంజాగుట్ట చౌరస్తా వరకు గంటల తరబడి క్యూ కట్టాయి.
* మెహిదీపట్నం నుంచి నానల్‌నగర్ టోలీచౌకీ, దర్గా, గచ్చిబౌలీ, లింగంపల్లి వరకున్న ప్రధాన రహదారిలోని టోలీచౌకీ ఫ్లై ఓవర్ కింద, రేటీబౌలీ చౌరస్తాల్లో భారీగా వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది.