హైదరాబాద్

మూసీ నాలా ప్రక్షాళణకు శ్రీకారం చుట్టాలి: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, సెప్టెంబర్ 23: నగరంలో మూసీ నాలా ప్రక్షళణకు శ్రీకారం చుట్టాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజా జీవితం అస్తవ్యవస్తంగా తయారైందన్నారు. నారాయణగూడ మూసీనాలాను శుక్రవారం సందర్శించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయభ్రంతులకు గురవుతున్నారని తెలిపారు. కాలువలు ఉన్నచోట రిటైర్నింగ్ వాల్ నిర్మాణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వలు కూడా రిటైర్నింగ్ వాల్ నిర్మించడంలో నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. 2002లోనే మాస్టర్ ప్లాన్ ప్రకారం రిటైర్నింగ్ వాల్ నిర్మాణం చేయాలని ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారు. రిటైర్నింగ్ వాల్ నిర్మాణాన్నికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక బస్తీలలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి పాల్గొన్నారు.
సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
కెపిహెచ్‌బికాలనీ: యెడతెరపి లేకుండా కురుస్తున్న వర్ష భీబత్సానికి జంట సర్కిళ్లలోని లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్ష తాకిడికి లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ఆ ప్రాంత వాసులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలైన ధరణినగర్, తులసినగర్ తదితర వంద గృహాలు జలదిగ్భందంలో చిక్కుకొని నిరాశ్రయులవడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సహాయంతో స్థానికులు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం పాలు తెచ్చుకోవాలన్న కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో వంట కూడా చేయలేని పరిస్థితి ఉంది. దీని కారణంగా వాళ్లు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కాదు.