హైదరాబాద్

నాలాల ఆక్రమణలపై శాటిలైట్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాలు కురిసినపుడు నీరు సజావుగా ప్రవహించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న నాలాలపై ఆక్రమణల తొలగింపుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాలాల ఆక్రమణల తొలగింపు అంశంపై టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గతంలో నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయాలన్నారు. నాలాల ఆక్రమణలపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేగాక, ఒక్కో నాలాపై ఎన్ని ఆక్రమణలున్నాయి? ఎంత మేరకు నాలా కబ్జాకు గురైందన్న విషయాన్ని టెక్నికల్‌గా గుర్తించేందుకు ఈ కమిటీ అధ్యయనం చేసి, పదిరోజుల్లో ప్రాథమిక నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అంతేగాక, నాలాల ఆక్రమణలకు సంబంధించి మరింత పారదర్శకంగా సమాచారాన్ని రాబట్టేందుకు శాటిలైట్ సర్వేను కూడా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు నాలాలపై వెలసిన ఆక్రమణల తొలగింపునకు సంబంధించి విజిలెన్స్ విభాగాన్ని త్వరలోనే మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. ఆక్రమణలకు సంబంధించిన లీగల్ కేసుల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఈ నెల 26న జరగనున్న క్యాబినెట్ సమావేశం ఆమోదం ఇవ్వనున్నట్లు తెలిపారు. మున్ముందు కూడా నగరంలోని నాలాల్లో ప్లాస్టిక్, ఇతర జీవ వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గడిచిన 20 ఏళ్లలో నాలాలతో పాటు నగరంలోని రెండు వేల చెరువుల్లో భారీగా దురాక్రమణలు జరిగాయన్నారు. ఆక్రమణల తొలగించాలని గతంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పునిచ్చినందున కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆక్రమణలపై తాము, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి వారానికోసారి ఒక్కో ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి , మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు.