హైదరాబాద్

గ్రేటర్‌లో అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపెడతాం: కేటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 20: గత పాలకుల పాలనలో చేసిన అభివృద్ధిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ఐదేళ్లలో చేసి చూపెడుతుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. గుడిమల్కాపూర్‌లో బుధవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. యాదవ్ భవన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు.. ఈసారి టిఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి కేవలం 19 నెలలు అయిందని, కానీ కొందరు పనికట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం.. దేశంలోనే ఎంతో ప్రజాదరణ పొందాయని తెలిపారు. మురికివాడలను డబుల్ బెడ్‌రూమ్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని టిఆర్‌ఎస్ అభ్యర్థులు లంగర్‌హౌస్‌కు చెందిన జి.్భగ్యలక్ష్మీ భూపతిరెడ్డి, కార్వాన్ డివిజన్‌కు చెందిన చెన్న నరేందర్‌దేవ్, గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి బంగారు ప్రకాష్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జీవన్‌సింగ్, కావురి వెంకటేశ్, శేఖర్‌రెడ్డి, భూపతిరెడ్డి, కార్మిక సంఘం నాయకుడు రామారావు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజలు హర్షిస్తున్నారు
కెపిహెచ్‌బికాలనీ: పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టి సక్రమంగా అమలుపరుస్తున్న పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బాలాజీనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం బాలాజీనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి పన్నాల కావ్యా హరీష్‌రెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని కెపిహెచ్‌బికాలనీ రోడ్ 4, మహారాష్ట్ర బ్యాంక్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న పథకాలను ప్రజలు హర్షిస్తున్నారని, కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తాము సైతం భాగస్వాములవుతామని హామీ ఇస్తున్నారని చెప్పారు. డివిజన్ అభ్యర్థి పన్నాల కావ్యారెడ్డి మాట్లాడుతూ తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కెపిహెచ్‌బి డివిజన్ అద్యక్షుడు ఏనుగు వెంకటేశ్వర్‌రెడ్డి, దాసరి రమేష్, తుల్జారాం, నర్సారెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, టైసన్, నర్సింహ్మరావు, నర్సింహ్మనాయి, ముత్యాల పద్మ, మమత, స్వరూప, భాగ్యమ్మ, భారతి, శ్రీను పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి
అల్వాల్: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే అల్వాల్‌లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తాయనీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బుధవారం మచ్చబొల్లారం 133 డివిజన్ పరిథిలోని తుర్కపల్లిలో తెరాస అభ్యర్థి రాజ్‌జితేంద్రనాథ్‌కు మద్దతుగా ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నదనీ గ్రేటర్‌లో ప్రజలు గెలిపిస్తే నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దుతామనీ ఆయన వివరించారు . గతంలో రాజ్‌జితేంద్రనాథ్ కార్పొరేటర్‌గా పనిచేసి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారనీ వాటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి గెలిపించాలనీ కోరారు. కార్యక్రమంలో తెరాస గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ఇతరులు పాల్గొన్నారు.
సబితా అనిల్‌కిషోర్‌ని గెలిపించండి: ఈటల
అల్వాల్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి విజయశాంతిరెడ్డి ని గెలిపించాలనీ రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు.