హైదరాబాద్

గిరిజనులకు 80శాతం సబ్సిడీతో రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తోందని, కనీసం 20 శాతం కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ధ్వజమెత్తారు. ట్రైబల్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో ‘స్టాండప్ ఇండియా స్కీమ్’ అవగాహన సదస్సు జరిగింది. చందూలాల్ మాట్లాడుతుండగా ప్రేక్షకుల నుంచి గిరిజనులు లేచి ‘ప్రభుత్వం రుణాలను అనుమతిస్తూ బ్యాంకులకు పంపినా బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని’ ఫిర్యాదు చేయగా- అదే మన దౌర్భాగ్యం అని మంత్రి సమాధానమిచ్చారు. ప్రజల డబ్బుతో ఎంజాయ్ చేసే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంవల్ల బ్రోకర్‌లను నమ్మి మోసపోతున్నారని అన్నారు. నిజాయితీగా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే గిరిజనులకు లక్ష రూపాయలు ఇవ్వలేరు కానీ ఎగనామం పెట్టేవారికి వేలాది కోట్ల రూపాయలు ఇస్తుందని దుయ్యబట్టారు. బ్యాంకు అధికారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సర్వే చేసి నిజాయితీగా రుణాలు మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ త్యాగరాజన్ మాట్లాడుతూ, ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను బ్యాంకులు చెల్లించకపోతే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి అమర్‌సింగ్ పాల్గొన్నారు.