హైదరాబాద్

గ్రేటర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 20: భారతదేశంలోనే గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌దేనని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్ సమీపంలోని గ్రాండ్ ఫంక్షన్‌హాల్లో బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం డివిజన్ పరిధిలోని దుర్గానగర్, లక్ష్మిగూడ, ఉడంగడ్డ, గగన్‌పహాడ్, మైలార్‌దేవ్‌పల్లి, గణేష్‌నగర్ తదితర బస్తీలలో కాంగ్రెస్ కార్యాలయాలను ప్రారంభించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో విశ్వనగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రజలను కేసిఆర్ మభ్యపెట్టి గ్రేటర్‌లో పబ్బం గడుపుకోవడానికి బకాయిల రద్దును తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఔటర్‌రింగురోడ్డు, మెట్రోరైలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్ట్, ఫ్లైఓవర్‌లు, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, కృష్ణా వాటర్ ఫేస్-2, 3, గోదావరి జలాల తరలింపు పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని అన్నారు. కాంగ్రెస్ చేసిన పనులనే తామే చేశామని కేసిఆర్, కేటిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గ్రేటర్‌లో పాగా వేయడానికి మంత్రులు ఇష్టానుసారంగా అబద్ధపు హామీలు గుప్పిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అభ్యర్థి టి.శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నోముల భీమయ్య యాదయ్య, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంరెడ్డి ప్రమోద్‌రెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఇఎన్ అశోక్ కుమార్, సోమ శ్రీనివాస్‌గుప్త, నోముల రాము యాదవ్, ఎస్.జైపాల్, దారమోని రమేష్ ముదిరాజ్, ఎన్.రాజు, అరుణ్ ముదిరాజ్, శంకర్, నర్సింగ్‌గౌడ్, రాజుగౌడ్ పాల్గొన్నారు.