హైదరాబాద్

ఎన్నాళ్లకు? ఎన్నాళ్లకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాతకాలపు భవనాల్లోని నిర్వాసితులు ఎపుడు ఏం జరుగుతుందోనంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతుంటారు. పదహారేళ్ల క్రితం నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు కిర్లోస్కర్ కమిటీ ప్రత్యేక అధ్యయనం చేసి, నగరాన్ని వరద భయం నుంచి రక్షించేందుకు చేసిన సిఫార్సులను అమలు చేయటంలో పాలకులు, జిహెచ్‌ఎంసి అధికారులు ఘోరంగా విఫలమవుతూనే వచ్చారు. కానీ ఇపుడు తాజాగా నాలాలపై ఉన్న ఆక్రమణలను గుర్తించేందుకు జిహెచ్‌ఎంసి మరో శాటిలైట్ సర్వేను ప్రారంభించింది. ఈ సర్వేలో భాగంగా గతంలో నాలా రూపురేఖలు, ప్రస్తుత తీరు, వచ్చిన ఆక్రమణలు, వాటి తొలగింపుకున్న న్యాయపరమైన అడ్డంకులు వంటివి అధ్యయనం చేయనున్నారు. ఈ సర్వేకు సంబంధించి రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు సోమవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రిమోట్స్, స్పేస్ అప్లికేషన్స్ శాఖ సహకారంతో చేపడుతున్న ఈ సమగ్ర నాలాల సర్వేను ఏ విధంగా నిర్వహించాలి, నాలాల వెంట ఎన్ని అక్రమ కట్టడాలున్నాయి? వాటిలో పక్కా భవనాలు, పేదల గృహాలు ఎన్ని అన్న తదితర అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించేలా ఆయా విభాగాల అధికారులకు శిక్షణనిస్తున్నారు. తెలగాణ రిమోట్స్, స్పేస్ అప్లికేషన్స్ విభాగం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులకు వేర్వేరుగా శిక్షణ నిర్వహించారు.
కాలయాపన కోసమేనా?
ఎప్పటికపుడు నాలాలు ఆక్రమణలు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తూరావటంతో ఇటీవల వర్షాలు దంచికొట్టడటంతో నగరం వరద భయంతో అరిటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో మరో సారి జిహెచ్‌ఎంసి ఉనికిని చాటుకునేందుకు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ చేసిన హడావుడికి కోర్టుకు బ్రేక్ వేసింది. ఈ క్రమంలో నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు తామేదో చేస్తున్నామని ప్రజలను నమ్మించేందుకు అధికారులు తాజాగా నాలాలపై సమగ్ర సర్వేను తెరపైకి తెచ్చారని, కాలయాపన కోసమే సర్వే నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 28వేల పై చిలుకు ఉన్న ఆక్రమణలు, అక్రమనిర్మాణాలను కూల్చివేయటంలో క్షేత్ర స్థాయిలో, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతుంటే వాటినెలా అధిగమించాలన్న విషయంపై దృష్టి సారించని అధికారులు సర్వేకు ఆదేశించారంటే అది ముమ్మాటికి కాలయాపన కోసమేనన్న వాదనలున్నాయి.