హైదరాబాద్

గాంధీలో పనిచేయని లిఫ్ట్‌లో పడి వృద్ధురాలికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 4: రోగి బంధువును పరామర్శించడానికి వచ్చి గాంధీ ఆసుపత్రిలో పనిచేయని లిఫ్ట్‌లోపడటంతో ఓ వృద్ధురాలి రెండు కాళ్లు, నడుము విరిగిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ (70) తమ బంధువులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో కలవడానికి వచ్చింది. కాగా గాంధీ ఆసుపత్రి లోపలికి వచ్చిన వెంటనే లిఫ్ట్ డోర్‌ను బాత్‌రూమ్ డోర్ అనుకుని తెరిచి అడుగు వేసింది. అయితే సదరు లిఫ్ట్ పనిచేయకపోవడంతో మరో అంతస్తులోనే ఆగి ఉంది. ఒక్కసారిగా పోచమ్మ బాత్‌రూమ్ డోర్ అనుకుని తెరిచి కాలు వేయడంతో ఆమె ఒక్కసారిగా పైనుంచి లిఫ్ట్ గోతిలో పడిపడిపోయింది. దీంతో ఆమె రెండు కాళ్లు, నడుము విరిగిపోయింది. వెంటనే గమనించిన ఆమె బంధువులు సిబ్బంది పోచమ్మను బయటికి తీసి చికిత్సను అందిస్తున్నారు. వాస్తవానికి లిఫ్ట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో లేదు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో లేనప్పుడు లిఫ్ట్ డోర్ తెరుచుకోకూడదు. అయితే లిఫ్ట్ పాడైపోవడంతో లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. వాస్తవానికి లిఫ్ట్ పనిచేయడం లేదని అక్కడ బోర్డు పెట్టడం సిబ్బంది కనీస కర్తవ్యం. అయితే అక్కడ ఎలాంటి బోర్డు పెట్టకపోవడం, పనిచేయని లిఫ్ట్‌కి అడ్డుగా బ్యారికేడ్ లాంటిది ఏర్పాటు చేయకపోవడం మూమ్మాటికీ సిబ్బంది నిర్లక్ష్యమే. గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి లిఫ్ట్‌ల ప్రమాదం కొత్తేమీ కాదు. మూడు నెలల క్రితం ఒక్కసారిగా లిఫ్ట్ రెండతస్తుల నుంచి కిందపడిపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాలం చెల్లిన లిఫ్ట్‌లతో రోగులు, వారి బంధువుల జీవితాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని రోగులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని నిర్మించామని చంకలు గుద్దుకుంటున్న నాయకులు అందులో కల్పించిన సదుపాయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గమనించాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా పరిపాలించామని చెప్పుకున్న గత ప్రభుత్వాలు ఊరూపేరూలేని కంపెనీలకు చెందిన ఏడు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. నాసిరకంగా లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడంలో ఎవరి హస్తం ఉందో తెలియదు. ఈ లిఫ్ట్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్. లక్ష్మారెడ్డి దృష్టిలో ఉన్నప్పటికీ కూడ వాటిని మార్చడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియదు. గాంధీకి పుణ్యానికి వస్తే ప్రాణాలు పోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయనడంలో అతిశయోక్తికాదు. ఇప్పటికైనా వెంటనే స్పందించి లిఫ్ట్‌లను మరమ్మతులను చేయాలని ప్రజలు కోరుతున్నారు. పనిచేయని లిఫ్ట్ వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించడం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోచమ్మ బంధువులు ఆరోపిస్తున్నారు.