హైదరాబాద్

ఆకట్టుకున్న ‘బతుకమ్మ’ నృత్యరూపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆక్టోబర్ 7: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ ఆడిటోరియంలో అఖిలభారత తెలుగు కవయిత్రుల సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న మేయర్ బంతు రాంమోహన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి, కళలు గురించి మాట్లాడుతూ తెంలగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కళలను కాపాడుకుందాం, కళాకారులకు చేయూతనిద్దాం అంటూ ప్రాచీన సాహిత్యం గురించి ప్రస్తావించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఎస్వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధిగా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొనగా డా. అలేఖ్య పుంజల సమన్వయకర్తగా వ్యవహరించారు. కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘బతుకమ్మ’ నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘దక్షిణాది రాష్ట్ర భాషలలో స్ర్తివాద కవిత్వం - నూతన పోకడలు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు వారిజారాణి అధ్యక్షత వహించారు. సదస్సులో ప్రముఖ కవి రామలింగం, డా. సోనియాజార్జి, డా. ఎల్జి మీరా, డా. చాగంటి తులసి, ఆచార్య అశ్వని, డా. ప్రేమ పాల్గొని తమ వ్యాసాలను సమర్పించారు.