హైదరాబాద్

కట్టుదిట్టంగా ‘కోడ్’ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాయని జిహెచ్‌ఎంసి కమిషనర్, ఎన్నికల అథారిటి డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఒకవైపు ఫిబ్రవరి 2న జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు ఎన్నికల కోడ్ అమలును పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు. ఇందుకు ఇప్పటికే నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిర్వహించిన వాహనాల తనిఖీలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రూ. 32.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీంతో పాటు స్టాటిక్ సర్వేలేన్ బృందాలు నిర్వహించిన సోదాల్లో మరో రూ. 97వేల 90వేలు స్వాధీనం చేసుకున్నామని, వీటిపై విచారణ జరుగుతోందని కమిషనర్ తెలిపారు. గురువారం నాటి స్టాటిక్ సర్వేలేన్ బృందం నిర్వహించిన సోదాల్లో మారుతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 19లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని తదుపరి విచారణ జరిగేంత వరకు ఐటి శాఖలో డిపాజిట్ చేశామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు అక్రమంగా ఏర్పాటు చేసిన లక్షా 58వేల హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు పేర్కొన్నారు. దీనిలో దాదాపు 6వేల 823 కటౌట్లు, 45వేల 245 ఫ్లెక్సీలు, 44వేల 627 బ్యానర్లు, 61వేల 298 పోస్టర్లు ఉన్నాయని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. దీనికి తోడు ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించే బృందాలతో పాటు అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం, ప్రచార తీరుతెన్నులను ఎప్పటికపుడు నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయి విధులు నిర్వహిస్తున్నాయని వివరించారు.