హైదరాబాద్

స్వైన్‌ఫ్లూ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: మహానగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ పంజా విసిరింది. గత కొద్దిరోజులుగా వాతారణం చల్లచబడటంతో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. వరంగల్ జిల్లా మద్దూర్ మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన వంగపల్లి భిక్షపతి (36) మూడురోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండగా, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయన్ను సిద్దిపేటకు తరలించారు. అక్కడ నయం కాకపోవటంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ కావల్సిన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు భిక్షపతికి హెచ్1ఎన్1 పాజిటివ్ రావటంతో స్వైన్‌ఫ్లూగా నిర్థారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెల్సుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు కూడా ఆసుపత్రికి వచ్చి భిక్షపతిని చూసి వెళ్లినట్లు తెలిపారు. అయితే పేద కుటుంబానికి చెందిన భిక్షపతి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను శుక్రవారం రాత్రిగానీ, శనివారం ఉదయం గానీ గాంధీ ఆసుపత్రికి తరలించాలని భావిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.