హైదరాబాద్

నేరస్థులపై నిఘా కోసం సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 21: నేరస్థులపై నిఘా నిమిత్తం సమగ్ర సర్వే చేపట్టాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిసెంబర్ మాస నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ రక్షక్ వాహనాల డ్రైవర్లకు, పోలీసు సిబ్బందికి నైపుణ్య మెరుగుకు శిక్షణ నిర్వహిస్తామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, వారెంట్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సలహాలు, సూచనలు ఇస్తూ ఆదేశాలిచ్చారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, వారికి కావాల్సిన న్యాయాన్ని సత్వరమే అందించాలని పేర్కొన్నారు. గత నేరాలు, దోపిడీ దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు తదితర నేరాల నివారణ, శాంతిభద్రతల పర్యవేక్షణ అంశాలపై సూచనలు ఇచ్చారు. పోలీసు అధికారులెవరైనా ఫిర్యాదుదారుడి నుంచి, ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజ రుగ్మతలపై జిల్లా పోలీసుల కళాబృందంచే నేరాలకు మూలమైన మూఢనమ్మకాలు, వశీకరణం, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, మద్యానికి బానిస వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించిన అధిరులను అభినందించి ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎఎస్‌ఐ కిష్టప్ప, ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.బల్వంత్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు ఎస్.మహేశ్, బి.ఆనంద్‌రావును పతకాలు, బహుమతులతో ప్రశంసించారు.
ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, పిజిలలో ప్రతిభ కనబర్చిన 25 మంది పోలీసు పిల్లలకు ప్రోత్సాహకం కింద రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి, తాండూరు ఎఎస్పీ చందనదీప్తి, వికారాబాద్, చేవెళ్ల, డిటిసి డిఎస్పీలు టి.స్వామి, రంగారెడ్డి, లతామాధురి పాల్గొన్నారు.