హైదరాబాద్

దండాలండి.. దయుంచండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం మధ్యాహ్నంతో ముగిసింది. మొత్తం 150 డివిజన్లలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారన్న తుది జాబితా దాదాపు ఖరారైన నేపథ్యంలో అధికార టిఆర్‌ఎస్, విపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి, మజ్లిస్ పార్టీలు ఇక ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు నేటినుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అయిదేళ్ల పాటు అధికారంలో ఉండే పాలకమండలి సభ్యత్వం దక్కించుకునేందుకు అభ్యర్థులు దండాలండి..మాపై దయుంచండి! అంటూ ఓటర్ల ముందుకు రానున్నాయి. ప్రచారం విషయంలో శివార్లలోని 60 డివిజన్లకు చెందిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో ముందుండగా, కోర్ సిటీకి సంబంధించిన 90 డివిజన్లలో ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, మజ్లిస్, బిజెపిలు హోర్డింగ్‌లు, సోషల్ మీడియాలో ఇప్పటివరకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ఇక నేటి నుంచి బడా నేతలను కూడా రంగంలో దింపేందుకు ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. వివిధ పార్టీల తిరుగుబాటు దారులతో నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు కొంత ఆశాజనకంగా ఫలించాయనే చెప్పవచ్చు. ఒక్కో డివిజన్‌లో ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, మజ్లిస్ పార్టీలు తమ ప్రత్యర్థులను ఎంచుకుని వారు ప్రచారం చేసిన ప్రాంతాల్లోనే ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నగరాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ప్రజలకు వివరించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ టిఆర్‌ఎస్ ఆరాట పడుతోంది.
కృష్ణా, గోదావరి జలాల తరలింపు, నిరంతర విద్యుత్ సరఫరాలతో పాటు డబుల్ బెడ్ రూం స్కీం, ఆసరా పథకాలు అధికార పార్టీ ప్రధాన ప్రచారస్త్రాలయ్యాయి. ఇదిలా ఉండగా, స్వరాష్ట్రంలో ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నగరాభివృద్ధి తమ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిడిపి, కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.
టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే హైదరాబాద్ నగరాభివృద్ధిని సాధించామని, ఇందుకు అప్పట్లో టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ, నెక్లెస్‌రోడ్డుతో పాటు ఫ్లైఓవర్లు వంటివి తామే చేపట్టామని ప్రజలకు వివరించేందుకు టిడిపి సిద్ధమవుతుండగా, ఏ పార్టీ అభివృద్ధి పనులను పూర్తి చేసినా, అందుకు అంకురార్పణ తమ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజలకు విస్త్రృతంగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అంతేగాక, మరో అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని, సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదంటూ కాంగ్రెస్ ప్రచారానికి సిద్ధమవుతోంది.