హైదరాబాద్

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పధకం (వాటర్‌గ్రిడ్) పనుల పురోగతిని బుధవారం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పరిశీలించారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో పట్టణ శివారులోని సిఎంఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. గవర్నర్‌కు రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జెసి, ఆర్టీఓ, సిఎంఆర్ విద్యాసంస్థల సెక్రటరీ గోపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా గవర్నర్ భారీ భద్రత నడుమ కాన్వాయ్‌తో పట్టణంలోని టిటిడి కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. కళ్యాణ మండపం వెనుకభాగంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మిస్తున్న లక్ష లీటర్ల నీటి సామర్ధ్యం గల సంపును పరిశీలించారు. నీటిని ఎక్కడి నుండి రప్పిస్తున్నారు.. ఎన్ని ట్యాంక్‌లు, సంపుల ద్వారా ఏ రకంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.. తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘణపూర్ పరిధిలోని క్షేత్రగిరి గుట్టపై నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇక్కడి సంపులోకి నీటిని తరలిస్తామని ఇక్కడి నుండి పట్టణంతో పాటు డబిల్‌పూర్, గిర్మాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లకు సంపులకు తరలిస్తామని అధికారులు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 168 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు వివరించారు. మున్సిపాలిటీలకు ఏ విధంగా నీరు సరఫరా చేస్తారని అడ్డంకులను ఏలా అధిగమిస్తున్నారని ప్రశ్నించిన గరవ్నర్‌కు అధికారులు మ్యాప్‌లో రూపొందించిన ప్రణాళికతో అన్ని వివరాలను వివరించారు. సంపును పరిశీంచి ఇక్కడి నేరుగా డబిల్‌పూర్‌లో నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఓహెచ్‌బిఆర్)ను సందర్శించారు. కేవలం ఒక నెల వ్యవధిలో దాదాపు 60 ఫీట్లమేర ఎత్తులో దీని నిర్మాణం చేపట్టారని పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. కొద్ది దూరంలో చేపడుతున్న పైపులైన్ పనులను గవర్నర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ పర్యటన సుడిగాలిలా సాగి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ముగిసింది. మిషన్ భగీరథ పథకం పనులను పరిశీలించడానికి గవర్నర్ ఒంటి గంటకు రావాల్సి ఉండగా సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా వచ్చి క్షణాల వ్యవధిలో తన పర్యటనను ముగించి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ పథకం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌పి సింగ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (మిషన్ భగీరథ) బి.సురేందర్‌రెడ్డి, ఎస్‌ఇ కె.విజయపాల్, ఇఇ ఎం.నరేందర్‌రెడ్డి, డిఇ వంశీకృష్ణ, జెసి రజత్‌కుమార్ సైనీ, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, ఏసిపి అశోక్‌కుమర్ గౌడ్, ఎఇలు విజయకుమార్, వసుధ, హరిణి, ఎంపిపి విజయలక్ష్మీ, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహయం, నగర పంచాయతీ కమిషనర్ కె.రామిరెడ్డి, ఇఓపిఆర్డీ జ్యోతిరెడ్డి, విద్యుత్ ఎఇ మోజెస్, సర్పంచ్‌లు రాజమల్లారెడ్డి, సురేందర్, నాయకులు భాస్కర్ యాదవ్, మల్లిఖార్జున్, విష్ణుచారి, సత్యనారాయణ, నారెడ్డి నందారెడ్డి, శ్రావణ్ గుప్త, ఆజ్మత్ ఖాన్, శ్రీనివాస్, రవీందర్, మల్లేశ్, తోట వసంత, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణమూర్తి గుప్త, మోనార్క్, శారద, ఆనంద్ పాల్గొన్నారు.