హైదరాబాద్

సుద్దాల హనుమంతు జయంతిని అధికారికంగా నిర్వహించేలా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, అక్టోబర్ 13: సుద్దాల హనుమంతు జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావుకు సుద్దాల హనుమంతు- జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వంగపండు ప్రసాదరావుకు సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. సుద్దాల హనుమంతు పాటలు తెలంగాణ సాయుధ పోరాటాన్నికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పాట ఉపిరిగా నిలిచిందని అన్నారు. సుద్దాల హనుమంతు చరిత్రను భావితరలకు అందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. వంగపండు ప్రసాదరావుకు తన ఒక్కనెల వేతనం ఇచ్చి ప్రోత్సహించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యావేత్త క్రాంతి శ్రీనివాస్‌రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు నారదాస్ లక్ష్మణ్‌రావు, ప్రముఖ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ప్రజాగాయకుడు గద్దర్, సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, కవి విమర్శకుడు నారాయణ శర్మ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.సుద్దాల అశోక్‌తేజ, సంస్థ కోఅర్డినేటర్ పి.సీతారామ్, ప్రముఖ నటుడు ఉత్తేజ్, పడకంటి యాదగిరి, నర్సయ్య పాల్గొన్నారు.