హైదరాబాద్

18న నగరంలో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీరుస్తున్న కృష్ణా ఫేజ్-3కి సంబంధించిన నీటి సరఫరా ప్రాజెక్టులో ఆటంకం తతెత్తడంతో మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ఈనెల 18న ఉదయం ఆరు గంటల నుండి 12 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు తెలిపారు. ఫలితంగా ఈనెల 18వ తేదీన నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రోజు ముందుగానే నీటిని నిల్వచేసుకోవాలని వినియోగదారులకు జలమండలి సూచించింది.
18న నీటి సరఫరా ఉండని ప్రాంతాలు :
బిఎన్ రెడ్డినగర్, ఎల్‌బినగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అల్కాపూరి, దిలుసుఖ్‌నగర్, ఆర్‌జికె, బండ్లగూడ, బాలపూర్, బాబానగర్, రియసత్‌నగర్, బార్కాస్, డిఆర్‌డిఎల్, డిఎంఆర్‌ఎల్, మిధాని, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, బిరాప్పగడ్డ, కైలాస్‌గిరి, ఎన్‌ఎఫ్‌సి, మైలార్‌దేవ్‌పల్లి, సులేమాన్‌నగర్, ఎంఎం పహడి, అత్తాపూర్, చింతల్‌మెట్, బుద్వేల్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌజ్, కాకతీయనగర్, హనుమాన్‌నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్, ఎంఇఎస్, గంధంగూడ, ఉస్మానియా యూనివర్శిటీ కాలనీ, టోలీచౌకీ, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ, రెడ్‌హిల్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, లక్డీకాపూల్, సెక్రటేరియట్, జియగూడ, అల్లబండా, గోడేకీఖబార్, ప్రశాసన్‌నగర్, గచ్చిబౌలి, లాలాపేట్, చాణక్యపూరి, గౌతంనగర్ ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదు.