హైదరాబాద్

హెచ్‌సియులో కొనసాగుతున్న ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు పత్రికలకు మీడియా ప్రతినిధులకు మెయల్స్ చేశారు. దీనిని వ్యతిరేకించిన విద్యార్థులు నిరసన ప్రాంతానికి వచ్చి యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్‌ని ఎత్తివేతను ప్రకటించాలని విద్యార్థులు పట్టుపట్టారు. అయితే ఉదయం నుండి విద్యార్థులు క్లాసులు బహిష్కరించి వారి డిపార్ట్‌మెంట్ల నుండి నిరసన తెలియజేస్తూ వెలివాడ సభా ప్రాంగణానికి వచ్చారు. ఐదో రోజు కూడా విద్యార్థులు, ఉద్యోగులు క్లాసులు, విధులు బహిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, విరసం ప్రతినిధి వరవరరావు, జెసి చైర్మన్ కోదండరాం తదితరులు వచ్చి విద్యార్థులకు మద్దతు ప్రకటించి రోహిత్ వేములకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై పెట్టిన సస్పెన్షన్‌ని బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రుల వత్తిడి వలనే అధికారులు ఐదుమంది విద్యార్థులపై బహిష్కరణ వేటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ వేముల రిజర్వేషన్‌తో యూనివర్సిటీలో చేరలేదని మెరిట్ ఆధారంగా సీటు పొందాడని వక్తలు గుర్తు చేశారు. మృతి చెందిన పిహెచ్‌డి స్కాలర్‌పై కుల వివాదం చేయడం అన్యాయమని నొక్కి చెప్పారు. కేంద్రమంత్రి స్వయంగా రోహిత్ దళితుడు కాదని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు యూనివర్సిటీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం వలనే రోహిత్ మృతి చెందాడని విమర్శించారు. అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకులు తమపై దాడి జరిగినప్పుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, అప్పుడే పట్టించుకుని ఉంటే రోహిత్ మరణించేవాడు కాదన్నారు. ఎబివిపి విద్యార్థులకు యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. రోజులతరబడి అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకులను పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పారని చెప్పారు. కేంద్రం స్పందించి వైస్‌చాన్సలర్‌పై చర్య తీసుకోవడంతోపాటు మంత్రులను తప్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన విషయాన్ని వివాదాస్పదం చేసి విద్యార్థి మృతికి కారకులైనారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులను అందించే యూనివర్సిటీలో సాంఘిక బహిష్కరణ చేయడం అన్యాయమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. గాయకుడు జయరాజు తన ఉద్యమ పాటలతో అందరినీ ఆలోచింపచేశారు.
ప్రధాని స్పందించాలి: ప్రజా గాయకుడు గద్దర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనపై ప్రధాని మోది స్పందించాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. బహిష్కరణకు గురైన విద్యార్థులు మద్దతుగా గద్దర్ సాయంత్రం యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులను పరామర్శించి రోహిత్ వేములకు నివాళులర్పించారు. భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఉద్యమం జరగలేదని విద్యార్థులందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారని చెప్పారు. డిమాండ్ల సాధనకోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని దీనికి విద్యార్థులందరు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. మృతి చెందిన రోహిత్‌ని చూడాలని ఆసుపత్రికి వెళ్తూ కనీసం చివరి చూపు కూడా పోలీసులు అనుమతివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన పోలీసుల తీరులో మార్పు రాకపోవడం విచారకరం అన్నారు. మృతి చెందిన విద్యార్థి కులం ముఖ్యం కాదని విద్యార్థి కాబట్టి స్పందించానని గద్దర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించారు. గద్దర్ తన ఉద్యమ పాటలతో విద్యార్థులలో నూతన ఉత్సాహన్ని నింపారు.