హైదరాబాద్

అంతా అసమ్మతి జ్వాలలు.. కార్యకర్తల హల్‌చల్ ఘెరావ్‌లు, నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21:జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రధాన రాజకీయపార్టీల్లో చిచ్చుపెట్టాయి. ఏ పార్టీలో చూసినా అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని టికెట్ల కోసం ప్రయత్నాలు చేసిన ఆశావాహుల్లో కొందరికి బి ఫారాలు దక్కకపోవటంతో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. బిజెపి టికెట్ల కోసం నిన్నమొన్నటి వరకు అధినాయకులు, పార్టీ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేసిన ఆశావాహుల ఆగ్రహం కట్టలు తెంచుకుని పార్టీ కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యేలా చేసింది. ఇక గాంధీభవన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపుడు ఎన్నికలొచ్చినా పార్టీ జెండాను భుజాన వేసుకుని ఇంటింటికెళ్లి ఓట్లను అభ్యర్థించే చిన్న డివిజన్ స్థాయి నేతలకు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని వాదించారు. బడా నేతలను ఎదురించలేక, ఆశావాహులు కొందరు గురువారం గాంధీభవన్‌లో ఆత్మాహుతియత్నానికి పాల్పడటంతో అక్కడ తీవ్ర అలజడి నెలకొంది. ఇలాంటి అసంతృప్తి సెగలు అన్ని పార్టీల్లో ఉన్నా, కొందరు నేతలు అధినాయకుల బుజ్జగింపులతో సర్దుకుపోగా, ఇప్పటి వరకు అయిదారుసార్లు ప్రయత్నం చేసిన టికెట్ దక్కని వారు సహనం నశించి బి ఫారాలు తీసుకున్న అభ్యర్థులను సైతం ఘెరావ్ చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికే టిడిపి, కాంగ్రెస్, బిజెపితో పాటు అధికార పార్టీ టిఆర్‌ఎస్ నేతలు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆయా పార్టీలకు చెందిన నేతలే బహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమ దశలో అనేక రకాల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి జైలుకెళ్లిన నేతలకు సైతం ఆ పార్టీ టికెట్లు కేటాయించటంలో మొండి చేయి చూపిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇందుకు బేగంబజార్ టికెట్ కేటాయింపు ఒక నిదర్శనమని తెలంగాణ ఉద్యకారులంటున్నారు. బి ఫారాల మాట అలా ఉంచితే, ఇప్పటికే నామినేషన్లు ఉపసంహరించుకోకుండా అజ్ఞాతంలో ఉన్న ప్రధాన రాజకీయపార్టీల తిరుగుబాటు అభ్యర్థుల వ్యూహం ఏమిటీ? అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పటికపుడు బడా నేతలు ఆశావాహులను సముదాయించేందుకు, బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు ప్రచారానికి ఎంతవరకు కలిసొస్తారన్న దడ సైతం లేకపోలేదు. స్థానికంగా ఒకే డివిజన్‌లో ఉండే తిరుగుబాటు నేతలు తమ విజయానికి ఎంత వరకు సహకరిస్తారన్న అంశంపై కూడా అభ్యర్థులకు దడ పట్టుకుంది.