హైదరాబాద్

కుమ్మర ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ కుమ్మర శాలివాహన ఫెడరేషన్‌కు చైర్మన్, డైరెక్టర్‌లను నియమిస్తూ 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కుమ్మర శంఖారావంలో పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో బిసిలు చేసిన త్యాగాలు, కృషి ప్రభుత్వం మర్చిపోయిందా అని, బిసిలను ఓట్ల కోసం యంత్రాలుగా ఉపయోగించుకుంటోందని దుయ్యపట్టారు. రాజ్యాంగంలో బిసిలకు అన్యాయం జరిగిందని, రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు సవరించలేదని అన్నారు. ఈ దేశంలో బిసిలకు గౌరవం లేకుండా పోతోందని అన్నారు. బిసిలో 250 కులాలు ఉన్నాయని, చట్టసభల్లో 20 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. రాజకీయ పదవులన్నీ డబ్బున్న కాంట్రాక్టర్లకు ఉపయోగపడుతున్నాయని, డబ్బును వెదజల్లి రాజకీయాల్ని వ్యాపారంగా మారుస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. ప్రత్యేకంగా కృష్ణయ్య.. విలేఖరులతో మాట్లాడుతూ అర్హత లేని కులాలను కొంతమంది బిసిలో చేర్చమని అడుగుతున్నారని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికపై న్యాయంగా ఆలోచించాలని, నగరంలో కుమ్మర భవనానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రుణాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రంతోపాటు కుమ్మర సంఘం ధ్రువీకరించిన పత్రాలను కూడా తీసుకోవాలని కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో కులవృత్తులవారు ఎంతో పోరాడారని, చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాల వారికి న్యాయం జరుగుతుందని ఆశపడితే ప్రభుత్వం నీరు కారుస్తోందని అన్నారు. బిసిలకు న్యాయం జరుగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవతీస్తామని హెచ్చరించారు. తెంలగాణలో బిసిలు ఏకమై న్యాయం కోసం పోరాడాలని అన్నారు. ఒక ప్రక్క అన్యాయం చేస్తూ మరో ప్రక్క సామాజిక న్యాయం అని ప్రసంగాలు చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాసగౌడ్, పల్లె రవికుమార్, ముఖేష్ పాల్గొనగా ‘కుమ్మర్ల శంఖారావం’ మాస పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన సంపాదకులు రేపాల రాంబాబుకుమార్, జాతీయ ఎంబిసి ప్రధాన కార్యదర్శి సూర్యారావు పాల్గొనగా సభకు బండారి భిక్షపతి అధ్యక్షత వహించారు.