హైదరాబాద్

ఏ రోడ్డు వేసినా...అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఎండాకాలం చివరిరోజులొచ్చాయంటే చాలు జిహెచ్‌ఎంసి అధికారులకు కాసుల పండగే. వర్షాకాలానికి ముందే రోడ్లను రీ కార్పెటింగ్ చేస్తున్నామంటూ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రోడ్లు నగరంలో పెరిగిన రద్దీకి, భారీ వాహనాల రాకపోకలకు ఎంతో కాలం నిలువటం లేదు. ఇందుకు కారణం ఏమిటీ? రోడ్డు నిర్మించటంలో నైపుణ్యత, శాస్ర్తియత కొరవడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిటి రోడ్లపై ఏ మాత్రం నీరు చేరినా, అవి త్వరగా పాడైపోతున్నాయంటూ వైట్‌టాపింగ్ రోడ్లను ఎంచుకుంటే అవి వేసిన కొద్దిరోజులకే టాప్ లేచిపోతున్నాయి. ఈ క్రమంలో పేవర్ బ్లాకు రోడ్ల నిర్మాణం అంటూ సిమెంటు దిమ్మెలతో రూ. కోటిన్నర రూపాయలు వెచ్చించిన నిర్మించిన రోడ్లు కూడా వేసిన కొద్దిరోజులకే పగిలిపోతున్నాయి. ముఖ్యంగా రోడ్ల నిర్మాణ పనుల్లోనే గాక, మరమ్మతులు సైతం శాస్ర్తియంగా జరగటం లేదనే చెప్పవచ్చు. నెలరోజుల క్రితం కురిసిన వర్షాలకు బిటి రోడ్లపై ఏర్పడిన గంతలను పూడ్చటంలో వైబ్రేటర్‌ను తప్పకుండా వినియోగించాలంటూ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి, క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే గానీ వైబ్రేటర్లను వినియోగించే పరిస్థితి లేదు. అంతేగాక, కొన్ని బిటి రోడ్లపై ఏర్పడిన గుంతల్లో జిహెచ్‌ఎంసి సిబ్బంది బిటి మిశ్రమాన్ని వేసి పనైపోయిందనుకుంది. ఆ మిశ్రమం మొత్తం గుంతలోకి పంపించేందుకు వైబ్రేటర్లను వినియోగించని రోడ్లు అనేకం ఉన్నాయి. అంతెందుకు పలు ప్రాంతాల్లో సిసి రోడ్లపై ఏర్పడిన గుంతల్లో సైతం బిటి మిశ్రమం వేశారంటే రోడ్ల నిర్మాణం మాట దేవుడెరుగు కనీసం మరమ్మతులను కూడా శాస్ర్తియంగా చెప్పటలేదని చెప్పవచ్చు. నగరంలోని పలు మెయిన్ రోడ్లను గమనిస్తే దాదాపు నాలుగైదు అడుగుల వరకు సిసి, బిటి లేయర్లు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్ల నిర్మాణానికి ఎలాంటి విధానాన్ని అవలంభించాలి?, ప్రజలు కోరిన విధంగా, వెచ్చిస్తున్న ఖర్చుకు తగిన విధంగా కొంతకాలమైన రోడ్లు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యామ్నాయ మార్గాన్ని అనే్వషిస్తున్నట్లు సమాచారం. అయితే పేవర్ బ్లాకులతో ఇటీవలే ఖైరతాబాద్‌లో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం పేవర్ బ్లాకులు పగిలిపోయి అస్తవ్యస్తంగా మారింది. దీంతో గ్రేటర్ ఎంపిక చేసిన మొత్తం 45 రోడ్లలో మిగిలిన మరో 44 రోడ్లను కూడా పేవర్ బ్లాకులతో నిర్మించాలా? లేదా? అన్న అయోమయం నెలకొంది.
ప్రస్తుతం వర్షపు నీరు ఎక్కువగా నిలిచి పాడైపోయినట్లు 45 రోడ్లను గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాల్లో పేవర్ బ్లాకులతో నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ అక్కడ వర్షపు నీరే నిల్వకుండా శాశ్వత చర్యలు చేపట్టగలిగితే ఒక్కసారి వేసిన రోడ్డు ఎంతో కాలం చెక్కు చెదరకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటర్ స్టాగినేట్ పాయింట్లలో నీరు నిల్వకుండా శాశ్వత చర్యలు చేపట్టామంటూ ఏటేటా నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయే తప్ప, వాటితోనూ శాశ్వత ప్రయోజనం సమకూరటం లేదన్న వాదనలున్నాయి.