హైదరాబాద్

గణతంత్రం..ఎన్నికల మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: భారత గణతంత్ర వేడుకలు గ్రేటర్ నగరంలో ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని గల్లీగల్లీలో ఎగురవేసి యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇతరాత్ర రంగాల్లోని ప్రజలు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఒకవైపు జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం, మరోవైపు ఘనంగా గణతంత్ర వేడుకలు జరగటంతో సిటీ అంతా సందడిగా మారింది.
ప్రభుత్వ, ప్రభుత్వేతర, రాజకీయ, రాజకీయేతర, స్వచ్ఛంధ సంస్థలు,కాలనీ సంక్షేమ, కుల సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గల్లీగల్లీలోనూ మువ్వనె్నల జెండా రెపరెపలాడింది. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహూల్ బొజ్జ, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి జాతీయ పతాకాలను ఎగురవేసి, అత్యుత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. దీనికి తోడు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, టిడిపి, బిజెపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లతో పాటు ఇతర పార్టీ కేంద్ర కార్యాలయాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బిజెపి ఆఫీసులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ భవన్‌లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, గాంధీభవన్‌లో తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనాలను సమర్పించారు. అంబేద్కర్ కాలేజీలోమాజీ మంత్రి వినోద్ జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సినీ నటుడు బాలకృష్ణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం, ప్రచార రధాలపై వివిధ పార్టీల జెండాలు రెపరెపలాడగా, మంగళవారం పలు ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వనె్నల జెండా రెపరెపలాడింది.
ఉదయం ఎనిమిది గంటల నుంచి వివిధ పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పలువురు దేశభక్తుల త్యాగాలు, ధైర్య సాహాసాలను విద్యార్థులు భోధించారు. ఎందరో మహానీయుల త్యాగఫలం నేటి స్వాతంత్య్రమని, వారిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్లాలని అధ్యాపకులు విద్యార్థులకు సూచించారు. పలు పాఠశాలలు, విద్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలపై విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన తదితరంశాలతో పాటు క్రీడల్లోనూ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేయగా, పలు విద్యాలయాల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు యువతలో దేశభక్తి స్పూర్తిని పెంచాయి.
గణతంత్రం..ఘనంగా ప్రచారం
జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులు ఒకవైపు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూనే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పలు బస్తీలు, మురికివాడల్లో జాతీయ జెండాను ఆవిష్కరించినానంతరం అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బస్తీలు, మురికివాడల్లో యువజన సంఘాలు, పంచాయతీ కమిటీలతో కలిసి అభ్యర్థులు పాదయాత్రలు నిర్వహించారు. ఇప్పటికే ముమ్మరం సాగుతున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరింత ఉద్దృతమైంది.