హైదరాబాద్

వినూత్నంగా బల్దియా దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: మహానగరవాసులకు అవసరమైన పౌరసేవలు, అత్యవసర సర్వీసులను అందించే జిహెచ్‌ఎంసి ఈ ఏట కాస్త వినూత్నంగా దీపావళి సంబరాలను నిర్వహించింది. ఏ అంశమైన మార్పు తీసుకురావాలంటే ఒక వేడుక ద్వారా, సంబరాల ద్వారా ప్రజలకు తెలియజేస్తే అది మరిచిపోకుండా ఉంటుందన్న కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో ప్రస్తుతం చెత్త పడే ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లను పండుగ సంబరాలను నిర్వహించారు. నగరంలోని 24 సర్కిళ్లలో 1116 ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లను చెత్త పడుతున్నట్లు గుర్తించిన జిహెచ్‌ఎంసి గతంలో వాటిని తొలగించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి పాయింట్లలో అందమైన ముగ్గులు వేయటం, మొక్కలు నాటడంతో పాటు చెత్త వేయకుండా స్వచ్ఛ వాలంటీర్‌ను నియమించి, చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించటం వంటి చర్యలు చేపట్టడంతో వీటిలో దాదా 60శాతం వరకు ఈ చెత్త పాయింట్లను తొలగించగలిగారు. కానీ అలవాటులో పొరపాటు అన్నట్లు వాటిలో సగం పాయింట్లలో మళ్లీ చెత్త పడటం మొదలైంది. దీంతో వీటిని తొలగించగలిగితేనే స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో దేశంలోని మొదటి పది నగరాల్లో స్థానం సంపాదించుకుంటామన్న విషయాన్ని గ్రహించిన కమిషనర్ ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసేందుకు దీపావళి పండుగను చక్కటి అవకాశంగా వినియోగించారు. చాలా తేలిగ్గా విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లి, వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మళ్లీ చెత్త పడుతున్న సుమారు 500 ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లలో చెత్తను తొలగించి, స్థానికులు, జిహెచ్‌ఎంసి సిబ్బంది అక్కడ పోగై, అందమైన ముగ్గులు వేసి మిఠాయిలను పంపిణీ చేసి పండుగ జరుపుకున్నారు. ఈ రకంగా సంబరాలు నిర్వహించిన పలు ప్రాంతాల్లో తిరిగి అక్కడ చెత్త వేయమంటూ దీపావళి పండుగ సాక్షిగా స్థానికులు పలు ప్రతిజ్ఞ కూడా చేశారు. జిహెచ్‌ఎంసి సంకల్పం స్థానికులు, స్వచ్ఛ వాలంటీర్ల సహాయం ఇలాగే కొనసాగితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో కేంద్రం ఎంపిక చేసే పది నగరాల్లో మన సిటీకి స్థానం దక్కటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.