హైదరాబాద్

ఉద్దేశపూర్వకంగానే బిసి నేత ఆర్.కృష్ణయ్యపై వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 4: తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బిసి నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను వేధింపులకు గురిచేస్తోందని అఖిల భారత గౌడ సంఘం ఆరోపించింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం నాయకులు శివనాగేశ్వర రావు, వెంకటేష్ గౌడ్, సుదర్శన్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణంగా మారిపోయాయని, వారు కోరిన విధంగా భారీ నజరానాలు ప్రకటించినా ఆర్.కృష్ణయ్య లొంగకపోవడంతో ఈ తరహా వేధింపులకు తెరతీశారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరహంతకుడైన నరుూం కేసును సిబిఐచే విచారణ జరిపించి నిజమైన దోషులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో అగ్రకులాలకు దీటుగా రాజకీయంగా ఎదుగుతున్నారన్న అక్కసుతో బురదజల్లడం, వేధింపులకు గురిచేయడం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో భాగంగానే ఆర్.కృష్ణయ్యను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్.కృష్ణయ్యపై వేధింపులకు నిరసనగా ఈనెల 16న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్టు తెలిపారు. అనంతరం ఎంపీలు, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను విన్నవిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గోవర్ధన్, రామచందర్ గౌడ్, సుబ్బన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.