హైదరాబాద్

మల్కాజిగిరి ఘటనపై స్పందించిన జలమండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ప్రంపంచ బ్యాంకు నిధులతో తాగునీటి సరఫరా పథకాన్ని జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా సర్కిల్ పరిధిలో ఎనిమిది రిజర్వాయర్‌లు, 300 కిలోమీటర్ల పైచిలుకు పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. జలమండలి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులు మల్కాజిగిరి సర్కిల్ ప్రజల పాలిట శాపంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. సర్కిల్ పరిధిలో గత కొంతకాలంగా సఫిల్‌గూడ చౌరస్తా నుండి ఆనంద్‌బాగ్ వరకు జలమండలి పైప్‌లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపంతో కాంట్రాక్టర్‌లు ఇష్టానుసారంగా పైపులైన్ నిర్మాణ పనుల కోసం గుంతలు తవ్వి సరిగ్గా పూడ్చకపోవడంతో శనివారం సఫిల్‌గూడ చౌరస్తా వద్ద పైపులైన్ కోసం తవ్విన గుంతలో మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన అంజనేయులు అతని వదిన లక్ష్మి, యేసుదానం అనే వ్యక్తులు బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు పైపులైన్ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల కారణంగా రోడ్లను తవ్వడం వల్ల నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం, కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యం వల్ల పైపులైన్ నిర్మాణ పనుల నాసిరకంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అసంపూర్తిగా పైప్‌లైన్ పనులు చేయడం వల్ల శనివారం ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు.
* మల్కాజిగిరి ఘటనపై జలమండలి వివరణ: మల్కాజిగిరి సర్కిల్ ప్రాంతంలో తాగునీటి సరఫరా పథకంలో భాగంగా జలిమండలి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, పైప్‌లైన్‌ల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు రాత్రి వేళలో నిర్వహించాలని పనులు చేపడుతున్న ఏజెన్సీలకు జలమండలి స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. సఫిల్‌గూడ ఆనంద్‌బాగ్ ప్రాంతంలో 1600 మీమీల పైప్‌లైన్ పనులు రాత్రి వేళలో చేపట్టడానికి ఇండియన్ హోమ్ పైప్ కంపెనీకి జలమండలి అనుమతులను ఇవ్వడం జరిగిందని జలమండలి శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ హోమ్ పైప్ కంపెనీ ఈనెల 4న రాత్రి ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులు ప్రారంభించింది. అప్పటికే ఉన్న 150 మీమీ పైప్‌లైన్ కింద ఎంఎస్ పైప్‌లైన్‌ను వేశారు. అనంతరం తీసిన గుంతను పుడ్చడం జరింగిందని, మరుసటి రోజు శనివారం ఉదయం ఆరు గంటలకు తిరిగి ఈ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను యధావిధిగా అనుమతించారు. వివిధ కాలనీలకు ఉదయం ఏడు గంటలకు సాధారణ నీటి సరఫరా చేయడం జరిగింది. రెండు పైపుల మధ్య లింక్ తొలగిపోవడంవల్ల 150 మీమీ పైప్‌లైన్ లీకేజీ అవ్వడం ప్రారంభమైంది. ఈ లీకేజీ అనేది గుంతలో ఏర్పడటంతో మట్టి కొంత మేరకు తొలగిపోయింది. సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ గుంతపై ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గుంతలో పడి ఒక బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి చెందిన ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జలమండలి ప్రాజెక్టు, మెయింటనెన్స్ విభాగం అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యంత్రాల సహకారంతో గుంతలో పడ్డ ద్విచక్రవాహనాన్ని బయటకు తీశారు. పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెస్సర్స్ ఇండియన్ హోమ్ పైప్ కంపెనీపై సైనిక్‌పురి మెయింటనెన్స్ జలమండలి అధికారులు మల్కాజిగిరి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారని జలమండలి అధికారులు తెలిపారు.

ఎన్‌కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి
విరసం నేత వరవరరావు డిమాండ్
కాచిగూడ, నవంబర్ 5: బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచరణ జరిపించాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ పేరుతో 31మందిని తీవ్ర చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపుఎన్‌కౌంటర్ హత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసులను తీవ్ర చిత్ర హింసలుపెట్టి కాల్చి చంపడం దారుణమన్నారు. భోపాల్‌లో జ్యుడీషియల్ కస్టడిలో ఉన్న 8మందిని సిమీ కార్యకర్తలనే నెపంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం బహిరంగంగా కాల్చి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పేరుతో అమాయకులను చంపడం ఆపాలని అయన డిమాండ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ నరుూం ముఠా నేర సామ్రాజ్యంలో భాగం పంచుకున్న రాజకీయ, పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారం అరెస్టు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దుర్మార్గాపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడడానికి కార్యాచరణ రూపొందింస్తామని హెచ్చరించారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాజ్యంగంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందని నిరాయుధులైన వారిని చంపడం సరైంది కాదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న నాయకులే నరుూంను పెంచి పోషించారని విమర్శించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నేతలు జైని.మల్లయ్య, ప్రొ.పి ఎల్.విశే్వశ్వరరావు, ప్రొ.పద్మజా షా, ప్రొ.వైకె.రత్నం, చిక్కుడు ప్రభాకర్, కోట శ్రీనివాస్, బండి దుర్గాప్రసాద్, కంచర్ల బద్రి, రమామేల్కోటి పాల్గొన్నారు.

రిందా శరణ్య చిన్నారుల నృత్య సౌరభం

హైదరాబాద్, నవంబర్ 5: ప్రముఖ కూచిపూడి నాట్యచారిణి యశోదా ఠాకూర్ 1996లో స్థాపించిన రిందా శరణ్య నృత్య అకాడమీ ద్వారా ఇరవై సంవత్సరాలుగా ఎంతోమంది చిన్నారులను నృత్య కళలో తీర్చిదిద్ది అనేక ప్రదర్శనలు ఇప్పించి 20వ వార్షికోత్సవ విజయోత్సవాన్ని శనివారం సాయంత్రం రవీంద్రభారతిలో నిర్వహించారు. సంబరాలు వినాయక కౌతంతో ప్రారంభమై మండోదరి శబ్దం అంశాన్ని చక్కని ఆంగికాభినయంతో శిరీష, అలేఖ్య, ఆపేక్ష ప్రదర్శించారు. ఆరభి రాగం ఆదితాళంలో తరంగం అంశాన్ని భూదేవి విష్ణువును ప్రార్థిస్తూ చేసే అంశాన్ని మల్లిక, సౌమ్య, హంసికలు నృత్యం చేసారు.