హైదరాబాద్

మంచి ఉత్తరాలు సమాజానికి ఎంతో ఉపయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 6: మంచి ఉత్తరాలు సమాజనికి ఎంతో ఉపయోగపడతాయని తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. ‘చలసాని ప్రసాద్ లేఖలు - సన్నిధానం నరసింహ శర్మకు రాసినవి’ పుస్తకావిష్కరణ సభ స్పృహ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ, ఒక రచయిత పనిచేసిన సంస్థ సభ్యులు కాకుండా ఆయనపై పుస్తకం అచ్చువేసినప్పుడే అతని గొప్పతనం తెలుస్తుందన్నారు. చలసాని మానవతా దృష్టితో స్నేహ సంబంధాలను కొనసాగించాడని పేర్కొన్నారు. రచయిత సమాజంలో నుంచే రూపొందుతాడని తెలిపారు. చలసాని ప్రసాద్ ఎంతో పరిశోధనలు చేసి పుస్తకాలను రచించారని కీర్తించారు. రెండు దశాబ్దల క్రితం రాసిన లేఖలను జాగ్రత్తపరిచి పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో అభినందనీయమని అన్నారు. మానవ సంబంధాలలో ఉత్తరాల ప్రాధాన్యత ఎక్కువగా ఉందన్నారు. ఉత్తరాల ప్రక్రియ అంతరించిపోతున్న సమయంలో ఉత్తరాలను పుస్తక రూపంలో అచ్చువేసి సమాజానికి అందించడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో విప్లవ కవి నిఖిలేశ్వర్, కవి సూర్యవంశి, రచయిత విమర్శకుడు డా.ఎకె.ప్రభాకర్, ఆచార్య ఆర్‌ఎస్.సరయ్య తదితరులు పాల్గొన్నారు.