హైదరాబాద్

తోటి విద్యార్థుల వేధింపులు.. విద్యార్థిని అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ఓ ప్రైవేటు కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపులను తాళలేక ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన బుధవారం ఎల్‌బినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనా వివరాల్లోకి వెళితే.. ఎల్‌బినగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్స్ సమీపంలోని నారాయణ కాలేజీలో సాయి రూప అనే విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తోటి విద్యార్థులే వేధిస్తుండటం వల్ల విద్యార్థిని మంగళవారం కనిపించకుండా పోయింది. రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. తమ సమీప బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా జాడ లేకుండా పోయిందని విద్యార్థిని తండ్రి తెలిపారు. కొంతకాలంగా ఆమెను తోటి విద్యార్థులు వేధిస్తున్నట్టు, తాము ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైనట్టు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తోటి వారే తనను వేధిస్తున్నారని తమకు చెప్పిందని, తోటి విద్యార్థులే కదా..అంటూ నచ్చజెప్పి కాలేజీకి పంపామని చెబుతున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే విద్యార్థిని అదృశ్యం వెనుక తోటి విద్యార్థుల వేధింపులే కారణమా..లేదా, కుటుంబ సమస్యలేమైనా ఉన్నాయా వంటి వాటిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.