హైదరాబాద్

ఫంక్షన్..టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరెన్సీ నోట్ల మార్పిడి కాలం నడుస్తోంది. రోజువారి అవసరాల కోసం వంద నోటు దొరకటమే గగనంగా మారిన సమయంలో వేలు, లక్షలు వెచ్చించాల్సిన ఫంక్షన్లంటే గుండే గుబేల్. ఉన్న నోట్లు చెలామణి గాక, బ్యాంకుల్లో పరిమిత నగదుకు ఇచ్చే రూ. 2వేల నోట్లకు బయట చిల్లర దొరక్క పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నిర్వాహకుల సంగతి అంతే సంగతులు. ఖాతాల్లో పుష్కలంగా డబ్బులున్నా, మందిని బ్రతిమాలక తప్పని పరిస్థితులున్నాయి. ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ సేవలందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులో అందుకు విరుద్దంగా తయారయ్యాయి. తమ వద్దనున్న వెయ్యి, 500 నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న ఖాతాదారుల్లో కొందరు ఇళ్లలో పెళ్లిళ్లు వంటి ఇతరత్ర ఫంక్షన్‌లు పెట్టుకున్నారు.
ఇలాంటి వారి పరిస్థితి వర్ణణాతీతం. బ్యాంకు ఖాతాల్లో లక్షలు మూలుగుతున్నా, ప్రస్తుతం నెలకొన్న కరెన్సీ మార్పిడి కారణంగా బ్యాంకు అధికారులు కేవలం రూ.10వేలు మాత్రమే ఇస్తున్నారని, ఆ మాత్రం డబ్బుతో ఫంక్షన్ ఎలా చేసుకోవాలని ఖాతాదారులు ప్రశ్నించటం ట్యాంక్‌బండ్ జిహెచ్‌ఎంసి ఎస్‌బిహెచ్‌లో కన్పించింది. ఆదివారం ఇంట్లో ఓ శుభకార్యాన్ని పెట్టుకున్న మహిళ ఒకరు డబ్బు డ్రా కోసం వచ్చారు. ఉదయం పదకొండు గంటలకు వచ్చిన ఆమె దాదాపు నాలుగు గంటల పాటు క్యూలో నిల్చున్న తర్వాత బ్యాంకు అధికారులు ఆమెకు కేవలం రూ. 10వేలను మాత్రమే విడుదల చేశారు. దీంతో తెల్లవారితో ఇంట్లో ఫంక్షన్ ఉందని, ఈ పదివేలు సరిపోవని, మిగతా నగదు ఎక్కడ సమకూర్చుకోవాలని వాపోయారు. అలాగే వచ్చే వారం సోమవారం నుంచి గురువారం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. వీటికి సంబంధించి నిర్వాహకులు కొందరు తమ వద్ద పెద్ద మొత్తంలో నున్న పాత వెయ్యి, 500 నోట్లను మార్పిడి చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు ఫైనాన్షియర్లను ఆశ్రయించక తప్పటం లేదు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఫైనాన్షియర్లు పది శాతం వడ్డీని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలో
నిర్బంధ తనిఖీలు
పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు
అర్థరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు
హైదరాబాద్, నవంబర్ 12: నార్త్‌జోన్ పరిధిలోని చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డిసిపి సుమతి పర్యవేక్షణలో శనివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు అర్థరాత్రి తర్వాత కూడా కొనసాగాయి. తనిఖీల్లో స్పెషల్ పోలీసు, శాంతిభద్రతలు, ఐటి విభాగానికి చెందిన దాదాపు 375 మంది పోలీసులు పాల్గొన్నారు. చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలోని మహ్మద్‌గూడ, ఎకె ఫంక్షన్‌హాల్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాలకు సంబంధించి పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిర్బంధ తనిఖీలకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. పెద్ద నోట్లను రద్దు నేపథ్యంలో నిర్వహించిన నిర్బంధ తనిఖీ నగరంలో ఇదేమొదటిది.