హైదరాబాద్

గ్రేటర్ పరిధిలో ఫిబ్రవరి 2న సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఆయా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్.రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు ఆయన వివరించారు. ఎన్నికలకు వినియోగించుకునే ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలకు ఫిబ్రవరి 1న కూడా సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేసారు. ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు కూడా ఆరోజు సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు ఆయన వివరించారు.

ఇవిఎంలలో బ్యాలెట్ అమరికను పరిశీలించిన కమిషనర్‌

హైదరాబాద్, జనవరి 28: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.
150 డివిజన్ల బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు, చిహ్నాలతో సిద్ధమైన బ్యాలెట్ పేపర్లను గురువారం మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎన్నికల సిబ్బంది ఇవిఎంలలో అమర్చారు. ఈ ప్రక్రియను కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ విభాగాలతో సమష్టి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.
నగరంలోని ఓటర్లు స్వచ్చంధంగా ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ, వారిని చైతన్యవంతలను చేసేందుకు వీలుగా పలు కార్యక్రమాల్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.దీంతో పాటు ఇప్పటి వరకు రక్షణ శాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 2678 సర్వీసు ఓట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల 2281 పోస్టల్ బ్యాలెట్‌లు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సిబ్బంది మాత్రం వారికి కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం రిపోర్టు చేయాలని ఆదేశించారు.