హైదరాబాద్

స్వేచ్ఛగా జీవించాలన్నదే కశ్మీర్ ప్రజల ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 17: నిర్బంధాలు తొలగిపోయి స్వేచ్ఛగా జీవించాలని కశ్మీర్ ప్రజలు ఆరాటపడుతున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఓపిడిఆర్) సభ్యులు వివరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కశ్మీర్ కల్లోలంపై ఓపిడిఆర్ రూపొందించిన నిజనిర్ధారణ నివేదికను నిజ నిర్ధారణ బృందం సభ్యులు ఉ.సాంబశివరావు (ఉసా), నర్సింహారెడ్డి వెల్లడించారు. నిత్యం ప్రజా ఉద్యమాలతో రగులుతున్న కశ్మీర్‌లో ఏడుగురు సభ్యుల బృందం ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు పర్యటించిందని చెప్పారు. చాలా విషయాలను తాము గుర్తించగలిగామని తెలిపారు. కశ్మీర్‌లో జరుగుతున్నది ఒకటైతే దేశవ్యాప్తంగా ప్రచారం మరొకటి జరుగుతుందని అన్నారు. దేశ విభజన నేపథ్యంలో పాకిస్తాన్‌కు సరిహద్దుగా ఉన్న కశ్మీర్ ప్రాంతం కొంత పాకిస్తాన్‌కు, మరింత కొంత భాగం ఇండియాలో మిగిలిపోయిందని దీంతో ఏళ్లుగా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ప్రజల హక్కుల గురించి మాట్లాడిన వారందరినీ ఈ దేశ ప్రభుత్వం వేర్పాటువాదులుగా గుర్తించి హింసలకు గురి చేస్తుండటం ఆవేదన కలిగిస్తుందని చెప్పారు. నాలుగు నెలలుగా రాష్ట్రం మొత్తం బందులు, హర్తళ్‌లు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు. కశ్మీర్ మొత్తం సైనిక శిబిరంగా మార్చారని, ప్రతి ఫర్‌లాంగ్ దూరంలో ఐదుగురు చొప్పున సైనికులు పహారా కాయడం దేనికి నిదర్శనమని అన్నారు. ఆ ప్రాంతంలో జన్మించిన స్ర్తిలపై పహారాకు వచ్చిన సైనికులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరిధిలో లేదంటూ సైనికులను శిక్షించేది భారత ఆర్మీనే అంటూ చేతులెత్తేస్తుండటం వారి మనోవేధనను మరింత పెంచుతుందని అన్నారు. కశ్మీర్ ప్రజలు రాజకీయ పరమైన పరిష్కారాన్ని కోరుకుంటున్నారని, తగిన వాతావరణం సృష్టించాల్సిన కనీస బాధ్యత ప్రజా ప్రభుత్వాలకు ఉంటుందని అన్నారు. సమావేశంలో న్యాయవాది బాలరాజ్ పాల్గొన్నారు.