హైదరాబాద్

సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నవంబర్ 30: గ్రేటర్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని తెరాస ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతుందని టిడిపి నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. సోమవారం నగర టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బిసిల జాబితాను తప్పుల తడకగా తయారు చేశారని ఆరోపించారు. బోగస్ ఓటర్ల పేరుతో టిడిపికి అనుకూలంగా ఉండే వారిని తొలగించారని అన్నారు. 200 డివిజన్‌లు అయితే తమకు అడ్డంకులు కలుగుతాయని రాత్రి రాత్రి మాటమార్చుకుని 150 డివిజన్‌లే ఉంటాయని ప్రకటించారు. వాటినీ యథావిధిగా ఉంచకుండా తెరాస, ఎంఐఎంకు అనుకూలంగా ఇష్టానుసారంగా మార్పులు చేసుకుని గందరగోళాన్ని సృష్టించారని అన్నారు. ఇక బిసి ఓటర్ల గణన విషయంలో అన్ని అక్రమాలకే పాల్పడ్డారని మాగంటి తీవ్రంగా దుయ్యబట్టారు. బిసిలు టిడిపికి అండగా ఉంటారని వారికి తీరని అన్యాయం చేశారని చెప్పారు. జనాభాలో 55శాతానికిపైగా ఉన్నా కేవలం 23శాతానికి కుదించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. బోరబండ డివిజన్‌లోని కొన్ని బూత్‌లను తీసుకుని పరిశీలిస్తే అందులో మైనారిటీలను బిసి ఓటర్లుగా చూపించారని అన్నారు. సికింద్రాబాద్‌లో కార్పోరేటర్‌గా చేసిన స్వరూపాగౌడ్‌ను ఓసిగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్నికల నిర్వహణ అధికారిని కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో నగర సెక్రటరీ జనరల్ ఎంఎన్ శ్రీనివాస్, సికింద్రాబాద్ ఇన్‌చార్జి మేకల సారంగపాణి, వనం రమేశ్, గోషామహల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భజరంగ్‌శర్మ, మలక్‌పేట్ ఇన్‌చార్జి ముజఫర్ అలీఖాన్, దినేశ్ యాదవ్ పాల్గొన్నారు.