హైదరాబాద్

‘రద్దు’ ఉపసంహరణ ప్రతిపాదన సరైంది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 19: నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన సరైంది కాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘కరెన్సీ సంక్షోభం గ్రామీణ ప్రజలపై వ్యవసాయ రంగంపై ప్రభావం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ రైతు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ నోట్ల రద్దుకు ముందస్తు సూచనలు చేయడం సరైంది కాదని తెలిపారు. నల్లధనంపై 2009లోనే ప్రతిపాదన జరిగిందన్నారు. నల్లధనానికి అనేక రూపాలు ఉన్నాయని వాటిపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లధనంపై పన్నుల రూపంలో అదనంగా వచ్చిన డబ్బులను రైతుల వ్యవసాయనికి ఖర్చు చేయాలని పేర్కొన్నారు. రైతులవద్ద ఉన్న డబ్బులు చెల్లవని ఆలోచన చేయకుండా బ్యాంకుల్లో జమచేయాలని సూచించారు. నోట్ల రద్దుపై ఆత్మహత్యలు పరిష్కారం కాదని నల్లధనంపై అవగాహన లేనందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. నోట్ల రద్దుపై అవగాహన లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సహకార బ్యాంకులలో కూడా పెద్దనోట్లను ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నుంచి అన్ని వ్యవసాయ సంబంధిత లావాదేవిలకు మినహాయింపునివ్వాలని కోరారు. చట్టపరమైన అన్నిలావాదేవీలకు పెద్దనోట్లు వాడకం అనుమతించాలని తెలిపారు. మార్కెట్లో ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోయాయని అమ్మకానికి, కొనుగోలుకు పెద్ద నోట్లను అనుమతించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతు సంఘం నాయకుడు ప్రొ.జలపతిరావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోలేదని అన్నారు. రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని కేవలం ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రైతుల సమస్యలపై తీసుకున్న నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో రైతు స్వరాజ వేదిక డా.జివి.రామాంజనేయులు, మహిళ రైతుల హక్కుల వేదికకు చెందిన ఆశాలత, కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ సజయ్, దళిత బహుజన ఫ్రంట్ పి.శంకర్, తొలకరి సంపాదకుడు కనె్నగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక బీరం రాము, కొండల్, నవీన్, విస్సా కిరణ్‌కుమార్, భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన శ్రీ్ధర్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘానికి చెందిన ప్రొ.కూరపాటి వెంకట నారాయణ పాల్గొన్నారు.