హైదరాబాద్

గోదావరి జలాల ఘనత కాంగ్రెస్‌దే: సబిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, జనవరి 29: కృష్ణా జలాలతో పాటు గోదారి జలాలను నగరానికి తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం సరూర్‌నగర్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నగరానికి తీసుకువచ్చిన గోదారి జలాలను, తామే తీసుకువచ్చినట్టు తెరాస మంత్రులు సిగ్గులేకుండా నెత్తిన నీళ్లు చల్లుకుంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో 50 ఏళ్ల వరకు ఎలాంటి నీటి సమస్య ఉండకూడదని, కృష్ణా జలాలతో పాటు గోదారి జలాలను నగరానికి తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆమె అన్నారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన కృష్ణా, గోదారి జలాలను సక్రమంగా సరఫరా చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆమె విమర్శించారు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే అని ఆమె గుర్తు చేశారు.
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రెండు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు వందల ఇళ్లు కట్టించి, వాటిని చూపించి ఓట్లు అడుగుతున్నారని ఆమె విమర్శించారు. మంత్రి మండలిలో మహిళలకు స్థానం లేదని అడిగితే, ముఖ్య మంత్రి మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా అని ప్రశ్నిస్తున్నారన్నారు. మహిళలకు మంత్రి మండలిలో స్థానం కల్పిస్తే, తన కూతురుకు ప్రాధాన్యం తగ్గుతుందనే మహిళలకు మంత్రి పదవి ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. ఒక్క ఇంటిలో రెండు పెన్షన్లు ఉండకూడదు కాని, కేసిఆర్ తన ఇంటిలో నాలుగు పదవులు మాత్రం ఇచ్చుకున్నాడని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. వేయి రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వం, సగం మందికి పెన్షన్లు తీసివేసిందని ఆమె విమర్శించారు. మహిళలకు మంత్రి పదవి ఇవ్వనివ్వకుండా అవమానించే, కేసిఆర్‌కు మహిళలు ఓట్లు వేయకూడదని కోరారు. తెరాసకు ఓట్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అంటున్నారని, కాని గ్రేటర్ హైదరాబాద్ రూ. 4 వేల కోట్ల బడ్జెట్ కల్గి ఉందన్నారు. హైదరాబాద్‌కు దాని నిధులు దానికి చాలని ఆమె అన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మీ ఇంటి బిడ్డగా, మీ సేవకురాలిగా లోకసాని నీరజ కొండల్‌రెడ్డిని భావించి ఓట్లువేసి గెల్పించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే నగరం అభివృద్ధి చేందుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వానికి కూతలు తప్ప, చేతలు లేవని ఆయన విమర్శించారు.