హైదరాబాద్

ధర్మయుద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, నవంబర్ 22: డా.బాబా సాహేబ్ అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్లు వారివారి జనాభా దామాషా ప్రకారం అందాలని ఆనాడే అంబేద్కర్ తెలిపారని, రిజర్వేషన్‌ల ఫలాలు అందరికీ సమానంగా అందడం కోసమే ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేపట్టిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ నెల 27న మాదిగల ధర్మయుద్ధం పేరిట నిర్వహించ తలపెట్టిన మహాసభను విజయవంతం చేయాలని మాదిగ విద్యార్ధుల సమాయత్త సభ అంబర్‌పేట డిడి కాలనీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎఫ్ నగర జిల్లా అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్షంలో ఉన్న యుపిఏ పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు పలుకుతున్నాయని అన్నారు.
మాదిగల ఉద్యమం మానవతా ఉద్యమమని మానవ హక్కుల ఉద్యమమని పేర్కోన్నారు. 1965లో లాల్‌బహదూర్ శాస్ర్తీ సమయంలోనే లోకూర్ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ నివేదికలో రిజర్వేషన్‌ల ఫలాలు కొంతమందికి మాత్రమే అందుతున్నాయని, ఎబిసిడి ద్వారానే దళితులలో అన్నికులాలకు సమాన న్యాయం జరుగుతుందని అందులో పేర్కొన్న అంశాలను తెలియచేశారు. సమైక్య రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మాల, మాదిగలలో ఎంత శాతం మంది వాటి ఫలాలు పొందుతున్నారో చదివి వినిపించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి మాదిగ జాతి మరువలేదని, ఒక్కడిగా మొదలుపెట్టి నేడు దేశ వ్యాప్తంగా కోట్లామందిని కూడగట్టాడన్నారు. తెలుగు రాష్టల్రతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి వర్గీకరణకు మద్దతు కూడగట్టిన ఘనత మంద కృష్ణదని కొనియాడారు. ఏబిసిడి వర్గీకరణ న్యాయ పోరాటమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే సమయంలోనే ఎస్సీ వర్గీకరణ కూడా అయి ఉండేదని సామాజిక తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎబిసిడిని ఆపడం ఎవరితరం కాదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముందుడి పోరాడింది అధిక సంఖ్యాకులు మాదిగలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెంలగాణ రాష్ట్రం సాధించాక ఎన్నిక సమయంలో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తామని, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అని అధికారంలోకి వచ్చాక పాలకులు విస్మరించాలని అన్నారు.త్వరలో మోత్కుపల్లి నరసింహూలు గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ మాదిగలు తమ సామాజిక వర్గాన్ని చెప్పుకువడానికి సిగ్గుగా భావించే స్థాయి నుంచి నేడు రొమ్ములు విరుచుకుని మేము మాదిగ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకు వచ్చిన ఘనత మందకృష్ణది అని ఆయనను మాదిగ కుల జాతి పితగా అభివర్ణించాల్సిన అవసరం ఉందన్నారు.
జనాభాలో తక్కువ శాతంలో ఉన్న అగ్రకుల నాయకులు రాజ్యాధికారం చేస్తున్నారని తెలంగాణలో ఉన్న కోటి మంది ఏకమై రాజ్యాధికరం సాధించుకునే దిశగా ఎదగాలన్నారు. 27న జరగబోయ సభకు మాదిగ కుల సభ్యులు తమ పూర్తి కుటుంబ సభ్యులతో పాటు వర్గీరణకు మద్దతు పలికే అన్ని సామాజిక వర్గాలను, కుల సంఘాలను, సభకు తీసుకు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులపై జరుగుత్నున దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని, కులరహిత, మతరహిత జమాజ స్ధాపజ జరిగే వరకు ఉద్యమం సాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రంమలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగాస్వామి మాదిగ, బోయ పూర్ణావతి, రామారపు శ్రీనివాస్ మాదిగ, పాలడుగు రమేష్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, జాతీయ కో-ఆర్డినేటర్ వేల్పుల సూరన్న కాపు, మన్నారం నాగరాజు, నాయకులు కొమ్ము శేఖర్ మాదిగ, బిక్కి మురళీకృష్ణ మాదిగ, నక్క వెంకటేష్ మాదిగ పాల్గొన్నారు. సభకు ముందు విమలక్క నిర్వహించిన పాటలు సభికులను ఉత్తేజ పరిచాయి.