హైదరాబాద్

‘గళం’తో గాన వర్షం కురిపించిన మంగళంపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: ప్రపంచమంతా గర్వించదగిన సంగీత కళానిధి, సంగీత బ్రహ్మ. ‘సళలిత రాగసుధా...’ అంటూ కొత్తకొత్త రాగాలను సృష్టించిన స్వర మాంత్రికుడు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు భాగ్యనగరంతోవీడని బంధముంది. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పలువురు జంట నగరాల కళాకారులు, కళాకోవిధులు, వివిధ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా వున్న సమయంలో బాలమురళీకృష్ణను దేవస్థానం ఆస్థాన గాయకుడిగా నియమించిన తరుణంలో మహాద్వారం దగ్గర ఆ తిరుమలేశుడిని ప్రార్థిస్తూ బాలమురళీకృష్ణ ఆలపించిన గానానికి ప్రకృతి పులకించి వర్షం కురిపించిందని కె.వి.రమణాచారి అన్నారు. అభినవ వాగ్గేయకారుడు మంగళంపల్లి సంగీత ప్రపంచంలో అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్యలను కలబోసిన స్వరబ్రహ్మ అని వర్ణించారు. సంగీత దర్శకుడిగా, సీని గాయకుడిగా భక్తప్రహ్లాద చిత్రంలో నారదుని పాత్రలో జీవించిన బాలమురళి సుమారు రెండువేలకు పైగా కచేరీలు చేశారు. ఎన్.టి. రామారావును, బాలమురళీకృష్ణను కలపడంలో తాను ప్రముఖ పాత్ర వహించానని, మంగళంపల్లి గానంలో జీవించారని, జీవించినంతకాలం పాడుతూనే వున్నారని రమణాచారి అన్నారు.
కళాకారులతో అను‘బంధం’ అనీర్వచనం
అగ్రశ్రేణి సంగీత కళాకారులలో మంగళంపల్లి ప్రముఖుడని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి అన్నారు. తాను తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నపుడు మూడవ స్నాతకోత్సవానికి మంగళంపల్లిని ఆహ్వానించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశామని సినారె గుర్తుచేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు. దేశంలోని సుమారు పది విశ్వవిద్యాలయాలకు పైగా బాలమురళిని సత్కరించి గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఎస్వీ సత్యనారాయణ అన్నారు. ఆయన కేవలం గాయకుడే కాదు మృదంగం, కంజీర, వయొలెన్ వాయిద్యాలలో కూడా నిష్నాతులని అన్నారు. ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తనదైన శైలిలో సంగీతంలో బాణీలను సమకూర్చిన సంగీత చక్రవర్తి బాలమురళీకి ప్రగాఢ సంతాపాన్ని ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ సినీ గాయకుడు చంద్రతేజ మాట్లాడుతూ తాను తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్న తరుణంలో ఆయన కచేరీ రికార్డ్ చేయగలిగే అదృష్టం దక్కిందని, ఆయన గానం చేసిన ‘ఎందరో మహానుభావులు...’ త్యాగరాజ కీర్తనకు ముగ్ధుడనయ్యానని, ఆ సమయంలో తాను గానం చేసిన ‘వౌనమే నీగానం...’ పాట విని భవిష్యత్తులో గొప్ప గాయకుడుతానని బాలమురళీకృష్ణ ఆశీర్వదించారని, ఆ తీపి గుర్తులు మరవరానివని చెప్తూ మంగళంపల్లికి చంద్రతేజ సంతాపం తెలిపారు. బాలమురళీ హైదరాబాద్ నగరాన్ని విచ్చేసి రవీంద్రభారతిలో కచేరీ చేస్తే ఆడిటోరియం పులకించిందని కళాభిమానులు అన్నారు. 2013 సంవత్సరం సెప్టెంబర్ 14న రవీంద్రభారతిలో కచేరీ ఏర్పాటుచేసి బాలమురళీకృష్ణను సత్కరించే భాగ్యం కలిగిందని, ఆయన సాక్షాత్తు త్యాగరాజ స్వామి స్వరూపమేనని, వంశీరామరాజు అన్నారు. బాలమురళీకి కనీసం ఇప్పుడైనా భారతరత్న ఇవ్వగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అని వంశీ రామరాజు అన్నారు.
బాలమురళీకి పుష్పాభిషేకం చేసే భాగ్యం కలిగింది
సంగీత దర్శకుడు రామాచారి
విజయనగరంలో ఆత్రేయ కళాపీఠం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణను పల్లకీలో ఊరేగంపుగా తీసుకొచ్చామని, ఆ తరుణంలో తానుకూడా పల్లకీ మోసానని, వేదికపై ఆ స్వరబ్రహ్మకు పుష్పాభిషేకం చేసామని గాయకుడు, సంగీత దర్శకుడు రామాచారి అన్నారు. అందరిని చిరునవ్వుతో పలుకరిస్తూ మనసులతో కలిసిపోయే మంగళంపల్లి సంగీత ప్రపంచంలో చిరంజీవిగా వుంటారని రామాచారి అన్నారు.