హైదరాబాద్

క్రమబద్ధీకరణకు నేడే చివరి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు చట్టబద్దత కల్పించేందుకు ప్రభుత్వం రెండు నెలల క్రితం ప్రకటించిన క్రమబద్ధీకరణకు నేటితో గడువు ముగియనుంది. ఆదివారం సెలవు రోజు అయినా ప్రజలు అన్ని సర్కిళ్లలోని సిటిజన్ సర్వీసు సెంటర్లలో తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసేందుకు వీలుగా వాటిని తెరిచే ఉంచుతున్నట్లు, సమాయాన్ని కూడా సాయంత్రం ఏడు గంటల వరకు అనుమతిస్తున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు బిపిఎస్ స్కీంకు సంబంధించి లక్షా 20వేలు, ఎల్‌ఆర్‌ఎస్ కోసం సుమారు 70వేల దరఖాస్తులొచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే సిటీలోని ఇంటి యజమానులు సర్కారు మళ్లీ గడువు పెంచుతుందన్న భావనలో ఉన్నా, జిహెచ్‌ఎంసి ఎన్నికల కోడ్ కారణంగా గడువు పెంచలేకపోయిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. నేటితో ఇందుకు గడువు ముగుస్తున్నా, జిహెచ్‌ఎంసి ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత సర్కారు గడువు పెంచే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ జిహెచ్‌ఎంసి నుంచి ఇప్పటి వరకు గడువు పెంచాలని కోరుతూ ఎలాంటి ప్రతిపాదనలు సర్కారుకు అందకపోవటంతో ఆందోళనకు గురైన ఇంటి యజమానులు చివరి రోజైన ఆదివారం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుల సమర్పించే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పటికే ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిహెచ్‌ఎంసి ఎక్కువ సంఖ్యలో వచ్చే దరఖాస్తులను ఎలా అప్‌లోడ్ చేస్తుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది.
అప్‌లోడ్‌కు భలే డిమాండ్
రూ. 20వేల నుంచి 25వేలు వసూలు
నవంబర్ మాసంలో ప్రభుత్వం ప్రకటించిన బిల్డింగ్ ఫినలైజేషన్, లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలకు సంబంధించి ఎక్కడా కూడా దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తుల సమర్పించాలని నిబంధన పెట్టింది. ఈ నిబంధన అమల్లో భాగంగా దళారుల మాట అలా ఉంచితే జిహెచ్‌ఎంసి గుర్తింపు పొందిన ఆర్కిటెక్చర్లు, సర్వేయర్లు మాత్రం ఇష్టారాజ్యంగా దరఖాస్తుదారుల నుంచి డబ్బు వసూలు చేశారు. తొలుత ప్రభుత్వం నెలరోజుల సమయం ఇవ్వటంతో డిసెంబర్ 31కి చివరి రోజున ఒక్కో దరఖాస్తును అప్‌లోడ్ చేసేందుకు ఆర్కిటెక్చర్లు, రూ. 20 నుంచి రూ. 25వేల మధ్య వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన డిడిని సమర్పించేందుకు వచ్చే దరఖాస్తుదారుల నుంచి కూడా జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ సిబ్బంది భారీగానే అమ్యామ్యాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.