హైదరాబాద్

రెండేళ్లలో ఎస్‌ఆర్‌డిపి పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపి (స్టాటజికల్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్) పనులను రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పై ఆయన గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమీక్ష నిర్వహించారు. మొత్తం ఎనిమిది ప్రధానంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం ఉప్పల్, శామీర్‌పేట, జూబ్లీబస్ స్టేషన్, రోడ్డు నెం. 45ల్లో ఎస్‌ఆర్‌డిపి కింద చేపట్టిన స్కైవేలు, మరో 54 జంక్షన్ల అభివృద్ధి పనులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. దీంతో పాటు కేవలం ఎండాకాలంలోనే గాక, ఏడాది పొడువునా నాలాల్లో పూడికను తొలగించే పనులు నిరంతరంగా కొనసాగించే విషయాన్ని జిహెచ్‌ఎంసి అధికారులు పరిశీలించాలని మంత్రి సూచించారు. ఇటీవలి వర్షాలకు ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శివారులో రూ. 2వేల కోట్లతో 2700 కిలోమీటర్ల పొడువున నిర్మించనున్న పైప్‌లైన్ల పనులకు సంబంధించి రోడ్ల నిర్వాహణ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. ప్రతి అయిదు నుంచి ఏడు కిలోమీటర్లకు జలమండలి, జిహెచ్‌ఎంసి అధికారులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నగరంలో అన్ని విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుజాగ్రత్తగా ఇలాంటి సమీక్షలు ఏడాదికి నాలుగు సార్లు, అంటే ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం దాదాపు 390 కిలోమీటర్ల పొడువున్న ఉన్న నాలాల్లో ఇప్పటి వరకు 216కిలోమీటర్ల వరకు సర్వే చేపట్టిమని, ఇందులో 8239 వరకు ఆక్రమణలను గుర్తించామని అధికారులు వెల్లడించగా, నాలాల విస్తరణకు ఇళ్ల తొలగింపును తగ్గించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్ అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. నాలాల్లో మట్టిని తొలగించటం, ఏడాది పొడువున ఎప్పటికపుడు పూడికను తీసివేయటం వంటివి చేపట్టే విషయాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. నాలాల నిర్మాణ పనులను ప్రీ కాస్టింగ్ పద్దతిలో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించాలని, ఇందుకు గాను యువత ముందుకొస్తే వారికి కాంట్రాక్టులు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయాన్ని ప్రస్తావించగా, ఇప్పటి వరకు 15వేల ఇళ్ల నిర్మాణానికి గాను టెండర్లను ఆహ్వానించామని వివరించారు. అవసరమైతే అదనంగా కూడా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మంజూరీ ఇస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు ఇప్పటికే నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న 30వేల జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు వౌలిక వసతులు కల్పించేందుకు రూ. 300 కోట్ల నిధులు సిద్దంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం స్వాధీనం చేసుకుంటున్న స్థలాల్లో క్లియర్ టైటిల్ ఉన్న వాటి వివరాలు మాత్రమే ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. నగర సుందరీకరణ విషయంపై చర్చిస్తూ కొత్త సంవత్సరంలో సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వాల్ పోస్టర్లు, గోడలపై రాతల నిషేధం, ఫ్లెక్సీ, ప్లాస్టిక్ రద్దు వంటి అంశాలకు సంబంధించి జనవర్ 1వ తేదీ నుంచి పబ్లిక్ డిఫేస్‌మెంట్ చట్టం అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారికి చర్యలు తీసుకునేందుకు వీలుగా నగర కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు మెజిస్టేరియల్ అధికారాలు కల్పించేలా చట్ట సవరణ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
శివార్లపై చిన్నచూపా? అలకచెందిన ఉప్పల్ ఎమ్మెల్యే
అభివృద్ధి పనులు, వౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంపై చిన్నచూపు చూపుతున్నారంటూ సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ అలక చెందారు. అంతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలుగచేసుకుని సముదాయించగా, నగరాభివృద్ధిలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం, శివారు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి కెటిఆర్ ప్రాంతాల వారీగా వివరించారు. కోరి సిటీ కన్నా ఎక్కువ అభివృద్ధి శివార్లలోనే జరుగుతుందని, శివార్లు, సిటీ అంటూ వివక్షకు తావులేకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.