హైదరాబాద్

నగదు రహిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతులు, వినియోగదారులు రైతు బజార్లలో చిల్లర కోసం అనేక ఇబ్బందులెదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి, వారి సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన మైక్రో ఏటిఎంల నగదు రహిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఐడిఎఫ్‌సి బ్యాంకు, టిసేవా సంయుక్త్ధ్వార్యంలో ఎర్రగడ్డ రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన మైక్రో ఏటిఎం సేవలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం వెయ్యి, 500నోట్లను రద్దు చేస్తూ, రూ. 2వేల నోటును అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ప్రజలకు చిల్లర కష్టాలు పెరిగాయని, ముఖ్యమంత్రి రైతులు, రైతుబజార్లలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సేవలు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు, వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిల్లర కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని రైతుబజార్లలో వేలిముద్రలు, ఆధార్ కార్డుల సహాయంతో రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేయటం జరుగుతుందన్నారు. చేసిన కొనుగోళ్ల ప్రకారం సాయంత్రానికల్లా రైతుల ఖాతాలో డబ్బు జమ అయ్యేలా, ఆ తర్వాత వారు డెబిట్ కార్డుతో డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందన్నారు. బ్యాంకు ఖాతాల్లేని రైతులకు, వినియోగదారులకు ఆధార్ కార్డులతో పైసా ఖర్చ లేకుండా కొత్తగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు కూడా తెరిపించటం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ పద్దతిని కూకట్‌పల్లి, మెహిదీపట్నం, సిద్ధిపేట రైతుబజార్లలో ప్రవేశపెట్టినట్లు మంత్రి వివరించారు. భవిష్యత్తులో లావాదేవీలన్ని కూడా నగదు రహితంగా మారనున్నందున ప్రజలు ఈ పద్దతికి అలవాటు పడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కొందరు వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకుంటున్న తీరును మంత్రి నేరుగా పరిశీలించారు. వివిధ ఆన్‌లైన్ సేవలపై టి సేవ ముద్రించిన పోస్టర్‌ను సైతం మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టి సేవా డైరెక్టర్ విమలరెడ్డి మట్లాడుతూ ఈ సేవలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, సిద్దిపేటలో తొలుత వెయ్యితో మొదలైన కొనుగోళ్లు ప్రస్తుతం 15వేలకు పెరిగాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.