హైదరాబాద్

కష్టాలు ఇప్పట్లో తీరేవి కావు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: చిల్లర కష్టాలు తీరేదెప్పుడు..? ఖచ్చితంగా ఇప్పుట్లో మాత్రం కాదంటే..కాదు.! ఈ మాటలు ఏకంగా ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు. కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 కొత్త నోట్లను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించి దాదాపు రెండు వారాలు కావస్తోంది. అందుబాటులోకి వచ్చే మాటలా ఉంచితే ఉన్న నోట్లు కూడా చెల్లని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత రూ.1000 నోట్ల చెలామణిని నవంబర్ 27న పూర్తి స్థాయిలో రద్దు చేసిన ప్రభుత్వం రూ.500 నోట్లను సైతం నవంబర్ 30 వరకే అనుమతించింది. ఇక పెట్రోలుపంపులు, ఎయిర్ పోర్టులలో చెలామణికి రూ.500 నోటుకు ఇచ్చిన గడువు కూడా శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. సరైన సమాచారం తెలియని సామాన్య, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. కేవలం పెద్ద నోట్లు ఇక బ్యాంకు ఖాతాలలో మాత్రమే జమచేసుకునే అవకాశం ఉంది, ఇప్పటివరకు బ్యాంకు అకౌంట్లు లేని వారు కొత్త అకౌంట్ల ఓపెనింగ్‌కై బ్యాంకులు, పోస్ట్ఫాసుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే బ్యాంకులలో జమ కోసం, విత్‌డ్రాల కోసం చాంతాడంత క్యూలైన్లు ఉంటుండటంతో నిత్యం బ్యాంకులలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటుంది. బ్యాంకు సిబ్బంది, కస్టమర్లకు మద్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ఇక ఎటిఎంల పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు. దాదాపు 96 శాతం ఎటిఎంలలో నోక్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పనిచేసే ఎటిఎంల నుంచి కేవలం రూ.2వేల నోట్లు మాత్రమే వస్తున్నాయి. దాంతో ఏ దుకాణానికి వెళ్లినా చిల్లర దొరకటం గగనమైంది. ఎటిఎంల వద్ద దాదాపు 2 గంటలు, బ్యాంకుల వద్ద నాలుగైదు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కొత్త నోట్లపై నగరంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏకంగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల జరిగిన జిఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లి, రూ.5వేల కోట్ల మొత్తానికి చిన్న డినామినేషన్ నోట్లను సరఫరా చేయాలని కోరి రోజులు గడుస్తున్నా ఫలితం శూన్యం. కాగా నగదు కొరతను తీర్చలేకపోతున్న ఆర్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిగే లావాదేవీలపై సర్‌చార్జీలను రద్దు చేయటం కొంత ఉపశమనం కలిగించే అంశం.