హైదరాబాద్

జనధన్ యోజన ఖాతాల వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రస్తుతం నగరంలోని బ్యాంకుల వారీగా జన్‌ధన్ యోజన ఖాతాలు ఎన్ని ఉన్నాయి? వాటిల్లో ఎంతమంది వాస్తవంగా ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారన్న వివరాలను తనకు సమర్పించాలని జిల్లా కలెక్టరే రాహుల్ బొజ్జా డిస్ట్రిక్ మేనేజర్‌ను ఆదేశించారు. అంతేగాక, జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలకెలాంటి సేవలందించాలనుకుంటున్నారు? ఎలాంటి కార్యక్రమాలను అమలు చేయాలనుకుంటున్నారన్న వివరాలతో కూడిన కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలను స్వీకరించేందుకు ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు ఇతరత్రా విషయాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత సేవలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్లను ఆదేశించారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి వద్ద కలెక్టర్ల సమావేశం జరగనున్నందున, ఇందుకు అజెండా, నోట్స్, ఆయా శాఖలు తమకు పంపాలని ఆదేశించారు.
ప్రధానంగా సంక్షేమ అభివృద్ది శాఖలన్నీ తాము ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్ని దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల క్రితం అప్పటి ప్రజల అవసరాలను బట్టి రూపొందించినవి అని అన్నారు. ప్రస్తుతం ప్రజల అవసరాలకు తగిన విధంగా ఆయా పథకాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా విద్యాశాఖ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్లలో ఎలాంటి మార్పులు చేయాలో సూచించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సంక్షేమ శాఖలు కూడా విద్యార్థులు, అంగన్‌వాడీల పిల్లలకు పంపిణీ చేసే పౌష్టికాహారం లో చేయాల్సిన మార్పులను సైతం తమ కార్యచరణ ప్రణాళికల్లో వెల్లడించాలన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో కూడా మార్పులు చేయాల్సిన అవసరముందని గుర్తిస్తే, అందుకు తగిన సూచనలు ప్రతిపాదించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌వో కిరణ్‌కుమార్, డిఇవో రమేష్,. సిపివో బలరాం డిఎస్‌వో రాథోడ్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి హన్ముంతు, బిసి సంక్షేమ శాఖ డిడి విద్య, డిసివో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.