హైదరాబాద్

మహతి క్రియేషన్స్ ‘నియతి’ నాటకం ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: మనిషి ప్రాప్తం లేనిదాని కోసం ఆరాటపడుతూ, తాయత్తులు కట్టుకొని మూఢ నమ్మకాల ముసుగులో తేలియాడుతున్నాడని, మాయలో పడి నియతిని మర్చిపోయి నిజాన్ని వదిలేస్తున్నాడని తెలిపే నాటకం ‘నియతి’. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని చెబుతూ అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి వుంది అనే సారాంశంతో నాటకం సాగింది. ఆరాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో చిట్టా శంకర్ రచించిన ‘నియతి’నాటకాన్ని మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రదర్శించారు. యు.సుబ్బరాయశర్మ దర్శకత్వంలో వైజాగ్ విజయలక్ష్మి, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, చిట్టా శంకర్ తదితరులు నటించారు. నాటకాన్ని మహతి క్రియేషన్స్ సమర్పించారు. తొలుత జరిగిన సభలో ముఖ్యఅతిథిగా నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, రంగస్థలంపై గుమ్మడికాయవంటి ప్రతిభకు ఆవగింజంత అదృష్టం వుంటేనే అవకాశం ప్రాప్తం అన్నారు. సుబ్బరాయశర్మతో కలిసి నటిస్తూ పోటీపడుతూ తాను నటుడిగా ఎదిగానని అన్నారు. ద్వానాశాస్ర్తీ అధ్యక్షత వహించగా గుమ్మడి గోపాలకృష్ణ, దుగ్గిరాల సోమేశ్వరరావు, నటి శైలజ పాల్గొన్నారు.

‘చంద్రశేఖర్ విజయము పద్యకావ్యం’ గ్రంథావిష్కరణ
కాచిగూడ, డిసెంబర్ 6: ప్రముఖ రచయిత రామోజు లక్ష్మీ రామయ్య రచించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జీవిత చరిత్ర ‘చంద్రశేఖర విజయము పద్యకావ్యం’ గ్రంథావిష్కరణ సభ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం భాషానిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి రమణచారి పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. కేసిఆర్ జీవిత చరిత్రను పద్య కావ్యాలుగా రచించడం ఎంతో అభినందనీయమని అన్నారు. కేసిఆర్ జీవిత చరిత్రను భావితరలకు అందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కాగజ్‌నగర్ కౌన్సిలర్ రాచకొండ గిరిష్‌కుమార్ తొలికృతిని స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ విమర్శకుడు డా.ఎస్వీ రామారావు, తాళ్లపల్లి మురళీధర్ గౌడ్, చిమ్మపూడి శ్రీరామమూర్తి, సంస్థ అధ్యక్షుడు రఘుశ్రీ పాల్గొన్నారు.