హైదరాబాద్

వేర్వేరు చేయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: భాగ్యనగరాన్ని చెత్త రహిత నగరంగా, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి చేపట్టిన చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి. ఇందుకు గాను ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 12వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నగరంలోని 30 సర్కిళ్లలోని సుమారు 20లక్షల ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఒక్కో ఇంటికి రెండు డస్ట్‌బిన్లను పంపిణీ చేయటంతో పాటు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా డంపింగా యార్డుకు చేరేందుకు 1700 పై చిలుకు ఆటో టిప్పర్లను క్షేత్ర స్థాయిలో వినియోగిస్తోంది. కానీ జిహెచ్‌ఎంసి ఆశించిన విధంగా ఇళ్ల నుంచి తడి,పొడి చెత్త వేర్వేరుగా రావటం లేదు. ఈ అంశంపై ఇదివరకే పలు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అవగాహన కార్యక్రమాలను చేపట్టినా, ప్రజల్లో అవగాహన పెరగలేదు. మరోవైపేమో నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి చేస్తున్న కృషిలో భాగస్వాములయ్యేందుకు గోద్రెజ్, ఐటిసి వంటి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ రెండు సంస్థలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కోట్లాది రూపాయలను వెచ్చించేందుకు ముందుకొచ్చాయి, ఇందులో గోద్రెజ్ సంస్థ సరికొత్త విధానంలో చెత్త తరలింపు, రీ సైక్లింగ్ చేసేందుకు రూ. 4 కోట్లతో జిహెచ్‌ఎంసితో అవగాహనవంతమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఇప్పటికే రాజేంద్రనగర్, ఉప్పల్ సర్కిళ్లలో తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుండటంతో దాన్ని మొత్తం గ్రేటర్‌లో అమలు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అలాగే ఐటిసి సంస్థ తడి,పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇస్తే కొనుగోలు చేసి, రీ సైక్లింగ్ చేసేందుకు ముందుకొచ్చినట్లు, ఇందుకు సంబంధించి మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే ఐటిసి సంస్థ ఆశించిన స్థాయిలో తడి,పొడి చెత్త వేర్వేరుగా రాకపోవటంతో ప్రతి ఇంటిలోని కుటుంబానికి పలు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలకు చెందిన 5వేల మంది సభ్యుల ద్వారా అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఇందుకు గాను వారికి నామమాత్రంగా ఛార్జీలను కూడా చెల్లించేందుకు జిహెచ్‌ఎంసి సిద్దంగా ఉంది. ఇంటి నుంచే చెత్త తడి,పొడిగా వస్తే మంచిదేనని భావిస్తున్న జిహెచ్‌ఎంసి, ఇలా కుదరని పక్షంలో ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులు సైతం తడి,పొడి చెత్తను వేర్వేరు చేసి ఇస్తే వారికి కిలోల వారీగా ఛార్జీలను చెల్లిస్తామని మంగళవారం మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు ప్రకటించారు.