హైదరాబాద్

అంబేద్కర్‌కి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 60వ వర్థంతి కార్యక్రమం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మినారాయణ విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.శంకర్‌ప్రకాష్, ప్రధాన కార్యదర్శి డి.అశోక్, అదనపు ప్రధాన కార్యదర్శులు కె.సురేందర్, బి.సత్యనందన్, మొగులయ్య, హిరిశంకర్, బి.అశోక్, సత్యవర్ధన్, గోవర్ధన్, కె.నర్సింగ్‌రావు, జోసఫ్‌తో పాటు బోర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద..
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మంగళవారం లోయర్ ట్యాంక్ బండ్‌లో జరిగాయి. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాలూరి సుధాకర్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రాష్టన్రేత బద్దం బాల్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, నేతలు బట్టివిక్రమార్గ, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, ప్రజా గాయకుడు గద్దర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళి ఆర్పించారు.
టిడిబిఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో..
అంబేద్కర్ ఆశయ సాధన ఆయనకు నిజమైన నివాళ్ళని తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు వలిగొండ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ 60 వర్దంతి పురస్కరించుకొని లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్ధులు సురేష్, ఉదయ్ కిరణ్, మోహన్, పవన్ కుమార్, అమిత్ పాల్గొన్నారు.
మహేశ్వరంలో..
మహేశ్వరం: మండలంలో బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తుక్కుగూడలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహేశ్, రమేశ్, శ్రీకాంత్, బాబు, మల్లేష్, సిఐటియు నేత దత్తు నాయక్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
బడంగ్‌పేటలో..
బాలాపూర్: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేసిన మహానుభావుడని బిజెపి రాష్ట్ర నాయకుడు మాజీ సింగిల్ విండో చైర్మన్ కోలన్ శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ 60వ వర్ధంతి పురష్కరించుకొని బాలాపూర్ మండలం బడంగ్‌పేట్ నగర పంచాయితీ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. కోలన్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, గుర్రం మల్లారెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, ప్రభాకర్, టి.్భస్కర్‌రెడ్డి, ఎనుగు రాంరెడ్డి, నాగరాజు, సంజీవ, శ్రీనివాస్‌రెడ్డి, హెమంత్‌రెడ్డి, బండ్యాల శంకర్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభివృద్ధి అంబేద్కర్ పుణ్యమే
వికారాబాద్: అణగారిన వర్గాల అభివృద్ధి అంబేద్కర్ పుణ్యమేనని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది అంబేద్కరేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, జిల్లా వాల్టా సభ్యుడు మంచన్‌పల్లి సురేష్‌లు పాల్గొన్నారు. ఏబివిపి ఆధ్వర్యంలో స్థానిక కెజిబివి పాఠశాలలో వర్థంతి నిర్వహించగా కెవిపిఎస్, సిఐటియు ఆధ్వర్యంలో మైలార్‌దేవరంపల్లి గ్రామంలో, వికారాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతిలో మున్సిపల్ వైస్‌చైర్మన్ సురేష్, కమిషనర్ అలి పాల్గొన్నారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు పాల్గొనగా, కొత్తగడిలో మాజీ కౌన్సిలర్ రాములు, కొంపల్లి ప్రాథమిక పాఠశాలలో టియుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్ నిర్వహించి స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి
దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేదని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.అనంత్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ సంగమేశ్వర్‌రావు, కౌన్సిలర్ నర్సింలు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి పాల్గొన్నారు.
బడుగుల పెన్నిది బాబాసాహెబ్
ఎల్‌బినగర్: బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించి వారి అభ్యున్నతికి పాటుపడిన బాబా సాహెబ్ అంబేద్కర్.. బడుగుల పెన్నిధి అని ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్, గ్రేటర్ బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వి.రాధధీరజ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్‌నగర్ ఫేజ్-1లో డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వంగేటి వెంకట్‌రెడ్డి, కందుకూరి సుదర్శన్, గునగంటి రమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ వి.రాధధీరజ్‌రెడ్డి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యదర్శి పిట్ట ఉపేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ వి.్ధరజ్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సంతోష్‌కుమార్, నాయకులు రాములు యాదవ్, మహేశ్, శ్రీశైలం యాదవ్, వెంకట్‌రెడ్డి, నాగరాజు, రాఘవాచారి, కృష్ణాచారి, శేఖర్‌గౌడ్, ప్రేమ్, నవీన్‌గౌడ్ ఉన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్ల: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి తెలిపారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చేవెళ్ల మండల పరిధిలోని ఆయ గ్రామాలతో పాటు సిపి ఐ పార్టీ నాయకులు చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. టిఆర్‌ఎస్ నాయకులు వసంతం, మండల అధ్యక్షుడు అనంతయ్య, రాములు, సిపిఐ చేవెళ్ల నియోజకవర్గ కార్యదర్శి రామస్వామి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు జంగయ్య, సత్తయ్య, దర్శన్, అనంతయ్య, బాల్‌రాజ్, రవి, నాయకులు విఠలయ్య, నర్సింలు, రాములు, శ్రీనివాస్, రమేష్, శివకుమార్, యాదయ్య ఉన్నారు.
షాబాద్‌లో..
షాబాద్: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెవైఎం జిల్లా కార్యదర్శి రాములు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ్ధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, తాళపల్లి, బోడంపాడ్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో దేశమోళ్ల అంజనేయులు ఇనాయత్, మహెందర్‌రెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.
హైదర్‌నగర్‌లో..
కెపిహెచ్‌బికాలనీ: దేశ ప్రగతికి అంబేద్కర్ వంటి మహనీయులు అవసరమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం అంబేద్కర్ 61వ వర్దంతిని పురస్కరించుకొని హైదర్‌నగర్ డివిజన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎల్.శ్రీనివాస్, వార్డు సభ్యుడు సింధం శ్రీకాంత్‌తో కలిసి ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ దేశానికి ఎంతో పేరు తెచ్చారని, అలాంటి మహనుభావుడి అడుగుజాడల్లో యువత పయనించాలని సూచించారు. కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాద బాలయ్య, నాయకులు లద్దె నాగరాజు, పురుషోత్తం యాదవ్, ఖాదీర్, శ్రీకాంత్, మహేశ్, సతీష్, అడవయ్య, హరీష్‌రావు, భాస్కర్ పాల్గొన్నారు.
కూకట్‌పల్లి వైజంక్షన్ వద్ద
భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ వర్దంతి సంధర్బంగా కూకట్‌పల్లి వైజంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వర్దంతి వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంగళ్‌రావు, సుభాష్‌గౌడ్, సత్యం, గాలి బాలాజీ, ప్రకాష్‌గౌడ్, ప్రభాకర్, నర్సింహ్మ, పుష్పారెడ్డి, పద్మారెడ్డి, ఆసిఫ్, సునీల్, మోయిజ్, యాదగిరి, విఠల్‌రెడ్డి, బషీర్, నసీర్ పాల్గొన్నారు.
అల్వాల్‌లో..
అల్వాల్: అంబేద్కర్ పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి.సాయన్న చెప్పారు. బిఆర్ అంబేద్కర్ వర్దంతిని పురస్కరించుకొని కంటోనె్మంట్‌లోని కార్కానలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పలు దేశాల్లో సరియైన రాజ్యాగం లేని కారణంగా రాజకీయ సంక్షోభాలను ఎదుర్కోంటుంన్నారని వివరించారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఒకే రకమైన చట్ట వర్తింస్తుందని, సామాజిక న్యాయం ఉండాలని, ప్రాంతాల వారీగా కులాల వారిగా వివక్ష ఉండకూడదని అంబేద్కర్ స్వేచ్ఛ భారతాన్ని కోరుకున్నారని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు టిఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్ పాల్గొన్నారు.
రసూల్‌పురలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహనికి కంటోనె్మంట్ బోర్డు వైస్ చైర్మన్ సాదా కేశవరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. బేగంపేట సిఐ జగన్ పాల్గొన్నారు. లోతుకుంటలో జరిగిన అంబేద్కర్ వర్థంతి వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగంతో దేశంలోని అందరికి సమన్యాయం జరగటం కోసం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారని చెప్పారు. కార్యక్రమంలో నందికంటి శ్రీ్ధర్ పాల్గొన్నారు.
యుగపురుషుడు అంబేద్కర్
నేటి తరంలో యుగపురుషుడు అంబేద్కర్ అని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. ఓల్డ్‌అల్వాల్ అంబేద్కర్ నగర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్, దళిత నాయకుడు సిఎల్ యాదగిరి పాల్గొన్నారు. వెంకటాపురం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్, వెంకటాపురం కార్పొరేటర్ సబితా కిషోర్ పాల్గొన్నారు.