హైదరాబాద్

శివారుల్లో తాగునీటి సరఫరా మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శివారు ప్రాంతాల్లో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపడుతున్న తాగునీటి సరఫరా మెరుగు ప్రాజెక్ట్‌లో పైప్‌లైన్ విస్తరణ పనులను జలమండలి ఎండి దానకిషోర్ బుధవారం వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేశారు. ముందుగా ఎండి అధికారులతో కలిసి సరూర్‌నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో చేపట్టిన 200ఎంఎం డయా అంతకంటే ఎక్కువ పరిమాణం గల ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను పరిశీలించారు. వనస్థలిపురం డివిజన్ గురుద్వారా, ముదిరాజ్ కాలనీలో చేపడుతున్న పనులను పరిశీలించారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. జలమండలి ఎండితో కలిసి సరూర్‌నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో సందర్శించారు. అనంతరం ఎండి ప్రాజెక్ట్ విభాగం, పనులు చేపడుతున్న ఏజెన్సీ నిర్వాహణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేవం నిర్వహించారు. రిజర్వాయర్ల నిర్మాణం పనులు, ఇన్‌లెట్, అవుట్‌లెట్‌తో పాటు 2500 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణ పనులను సూచించిన కాలంలో విజయవంతంగా పనులు పూర్తి చేయాలని ఎండి అదేశించారు. సమీక్ష సమావేశంలో ఎండితో పాటు ఇడి, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఎం.ఎల్లస్వామి, రెవెన్యూ డైరెక్టర్ శ్రీ్ధర్‌బాబు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నపుడే
పైప్‌లైన్ తవ్వకాలు చేపట్టాలి
జలమండలి పరంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ మరమ్మతుల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నపుడే రోడ్ల తవ్వకాలు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ సూచించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం నగరంలో పైప్ లైన్ తవ్వకాలపై జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులతో కలిసి సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో మరమ్మతుల కోసం చిన్న చిన్న తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిహెచ్‌ఎంసి అధికారులకు సూచించారు. నగరంలో రోడ్లకు వైట్ టాపింగ్ చేసే ప్రాంతాల్లో 30 చోట్ల జలమండలి అధికారులు పనులు పూర్తి చేసి జిహెచ్‌ఎంసికి అప్పగించాలని అన్నారు. పైప్ లైన్ విస్తరణలో ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్‌ఎంసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎండి జలమండలి ఇంజనీర్లకు సూచించారు. నగరంలో పైప్ లైన్ కోసం తవ్వే రోడ్ల మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించామని జిహెచ్‌ఎంసి అధికారులు సమావేశంలో ఎండి దృష్టికి తీసుకువచ్చారు. నగరంలోని బండ్లగూడ, పటేల్‌నగర్, లాలాపేట్, రాణిగంజ్, అన్నానగర్ వంటి 15 హౌసింగ్ కాలనీల్లో నల్లా కనెక్షన్లను ఇవ్వాలని జలమండలి ఎండిని జిహెచ్‌ఎంసి అధికారులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎండి హౌసింగ్ కాలనీల్లో ఎన్ని కనెక్షన్లు ఇవ్వాలో లేఆవుట్ ఇస్తే అంచనాలు తయారు చేస్తామన్నారు.
రోడ్ల తవ్వకాలు జరిపిన చోట ప్రాంతాల్లో రోడ్లను వెంటనే వేసి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులకు ఎండి సూచించారు. సమావేశంలో జలమండలి ఇడి, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ పి.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ జి.రామేశ్వరరావు, పిఆండ్‌ఎ డైరెక్టర్ అజ్మీరాకృష్ణ, జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్ పాల్గొన్నారు.