హైదరాబాద్

నగదు రహిత లావాదేవీలకు సన్నద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో పాటు, ఇక ముందు దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి కార్యాచరణను రూపొందిస్తోందని వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ పోద్దార్, తాండూరు సబ్-కలెక్టర్ సందీప్ కుమార్‌ఝూ పేర్కొన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్‌తో పాటు, మండల పరిషత్ కార్యాలయం ఠాగూర్ హాల్‌నందు రెండు చోట్ల అధికారులు బ్యాంకర్లతో జెసి, సబ్-కలెక్టర్‌లు నగదురహిత లావాదేవీల పట్ల అవగాహనా సదస్సులు నిర్వహించారు. పట్టణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో స్థానిక వ్యాపార, వాణిజ్య పారిశ్రామిక రంగాల వారితోపాటు, బ్యాంకర్లను సమావేశ పరిచి అవగాహన కార్యక్రమం చేపట్టారు, అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇకముందు దేశంలో, మన సమాజంలో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేనటువంటి నగదు లావాదేవీలు కొనసాగుతాయన్నారు. ఈమహాత్తర కార్యాచరణ వల్ల దేశంలో ప్రజలు ఒకమంచి ఆదర్శప్రాయమైన, నమ్మకమైన నగదు లావాదేవిలకు అలవాటు పడాల్సిన తరుణం ఆసన్నమైందని జిల్లా జెసి, తాండూరు సబ్-కలెక్టర్ వివరించారు. ఇక ముందు దేశవ్యాప్తంగా డిజిటలైజ్, ఆన్‌లైన్ సేవల ద్వారా నగదు రహిత లావాదేవీలు నడుస్తాయని తెలిపారు. అందుకు ప్రతి చిన్న వ్యాపారి మొదలు బడా వ్యాపారుల వరకు అందరూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన యంత్రాలను వాడాల్సి ఉంటుందన్నారు. ప్రతి దుకాణంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వ అధికార యంత్రాంగం సూచిస్తుందన్నారు. కాగా రైతులు, మహిళాసంఘాలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ నిర్దేశాను సారం నగదురహిత లావాదేవీలకు అలవాటు పడాలని జెసి, సబ్ సబ్-కలెక్టర్ వెల్లడించారు. ఈనూతన వినూత్న ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని, లావాదేవీలలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్థానిక లేదా జిల్లా అధికార యంత్రాంగాన్ని సంప్రదించి తమ ఇక్కట్లు, సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. బ్యాంకర్లు, వ్యాపారులు ప్రజలకు ముఖ్యంగా రైతులు, మహిళా సంఘాలకు అవరోధాలు రాకుండా సహకరించాలని జెసి సురేష్‌పోద్దార్, సబ్-కలెక్టర్ సందీప్ కుమార్‌ఝూ ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు, బ్యాంకర్లు సమావేశంలో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతిధులు వ్యక్తం చేసిన సందేహాలు, పలు అనుమానాలను జిల్లా పరిపాలనా ఉప అధికారులు నివృత్తి చేశారు.