హైదరాబాద్

ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: జిల్లా పరిధిలో ఆర్థికపరమైన అక్షరాస్యతను పెంపొందించేందుకు తగిన ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్డును సిద్దం చేయాలని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్‌ను కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. జిల్లాలోని 16 మండలాలకు బ్యాంకులను గుర్తించి మండలాల వారీగా మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు. పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రజల్లో నగదు రహిత సేవలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించటంపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన గురువారం జెసి, సిఆర్వో మాయాదేవీలతో కలిసి వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెయ్యి, 500 నోట్లు రద్దు చేసినందును ప్రజలకు అవసరాలకు తగిన విధంగా నగదు లభించక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రతిరోజు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులతో సహా ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు కావల్సిన నగదు అందుబాటులో లేనందున ఆయా వస్తువుల కొనుగోళ్లు ఈ సాస్ మిషన్లు, యుపిఐ, ఎస్‌బిఐ, మొబైల్ వ్యాలెట్లు, ఆధార్ లింకు తదితర సేవల ద్వారా ఏ విధంగా నిర్వహించవచ్చో ప్రత్యక్షంగా చూపించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇందుకై మండలాల వారీగా బ్యాంకులను, బస్తీలను గుర్తించి మండల కార్యాలయంలో అన్ని బ్యాంకులు పాల్గొని తమ తమ బ్యాంకుల ద్వారా అందిస్తున్న నగదు రహిత సేవలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన తగిన మెటీరియల్‌ను రూపొందించుకోవాలని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటిని ప్రజలకు వివరించాలని సూచించారు. అవసరమైన మెటీరియల్‌ను సంబంధిత బ్యాంకులు తయారు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు నగదు రహిత సేవలపై అవగాహన కల్పించటంతో పాటు ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లేని వారికి సైతం నూతనంగా ఖాతాలను తెరిపించాలని కలెక్టర్ సూచించారు. జెసి ఎం.ప్రశాంతి మాట్లాడుతూ నగదు రహిత సేవలకు ప్రజలను మళ్లించేందుకు అవసరమైన బెస్ట్ ప్రాక్టీసు నిర్వహిస్తూ, సమస్యలను తెల్సుకునేందుకు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నగదు రహిత సేవలపై ప్రస్తుతం మార్కెట్‌లో గల వివిధ రకాల పద్దతులను అనుసరించి కిరణా, రిటైల్ దుకాణాలు, సంతలు వంటి చోట వస్తువులను కొనుగోలు చేయటాన్ని ప్రజలకు నేర్పించాల్సిన అవసరముందని సూచించారు. లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కొందరు బ్యాంకర్లు జిలో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచేంకు నిరాకరిస్తున్నారని సమాచారం వచ్చిందని, అలా కాకుండా బ్యాంకర్లంతా కూడా జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరవాలన్నారు. డెబిట్ కార్డుల మాదిరి గిఫ్ట్ కార్డులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ఆర్‌బిఐ, ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, ఆంధ్రాబ్యాంక్‌లతో సహా అన్ని బ్యాంకుల నుంచి కంట్రోలింగ్ అధికారులు, వారి ప్రతినిధులు సిపివో, బలరాం తదితరులు పాల్గొన్నారు.