హైదరాబాద్

కుప్ప కూలిన ఏడంతస్తుల మేడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 8: నానక్‌రామ్‌గూడ ఘటనలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతులంతా దినసరి కూలీలే. మొన్న జూబ్లీహిల్స్‌లోని ఫిలిం క్లబ్, నిన్న కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఆర్చి, నేడు నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలి వలస కూలీల ప్రాణాలను బలిగొంది. విషాదకరమైన ఈ సంఘటన గురువారం రాత్రి తొమ్మిది గంటలకు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మహానగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలి కూలీలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సంఘటనలు జరిగినప్పుడు పాలకులు, అమాత్యులు, అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేస్తూ కూలీల ప్రాణాలకు పరిహారంతో వెలగడుతున్నారే తప్ప ఈ సంఘటనలు నివారించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. నిర్మాణాలకు అనుమతి ఉన్నా, దానిని అతిక్రమించి నిర్మించడం, అనుమతి లేకున్నా ఏకంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం, భూసార పరీక్షలు చేయకుండా ఐదారంతస్తుల భవనాల నిర్మాణానికి యజమానులు, కాంట్రాక్టర్లు చేస్తున్న ప్రయత్నమే కూలీల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా నానక్‌రాంగూడలో రాత్రి కుప్పకూలిన భవనం ఘటనకు ఆ భవనానికి కేవలం ఐదు అడుగుల దూరంలో సుమధుర కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన తవ్వకాలే కారణమని చెప్పవచ్చు. నానక్‌రాంగూడలో నేటికీ గ్రామ వాతావరణమే కన్పించినా ఆ ప్రాంతం జిహెచ్‌ఎంసి సర్కిల్ 11 పరిధిలోనే ఉంది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలను నివారించేందుకు ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకునేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని అధికార గణం తయారు చేసుకున్నామని ప్రకటనలు చేస్తున్నా నిర్మాణంలో ఉన్న మరో భవనం కూలి కూలీలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ దగ్గర ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు నానక్‌రాంగూడలో మరోసారి ప్రదర్శించారు. భవనం నిర్మిస్తున్న ప్రాంతానికి రాకపోకలు సాగించేందుకు కనీసం పది అడుగుల వెడల్పుతో రోడ్ లేకపోయినా సిల్ట్ ప్లస్ సిక్స్ అంతస్తుల భవన నిర్మాణం కొనసాగించడం టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి విధి నిర్వహణకు నిదర్శనం. ఫిలింక్లబ్ లాంటి అక్రమ నిర్మాణాలు నాసిరకం సరుకుతో కళ్లముందే జరుగుతున్నా పట్టించుకోని జిహెచ్‌ఎంసి అధికారులు నానక్‌రాంగూడలో మరో ఘటనకు బాధ్యులయ్యారు. కనీసం రాకపోకలు సాగించేందుకు రహదారి సైతం లేని ఈ ప్రాంతంలో ఏకంగా ఏడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఉందా అనే ప్రశ్నకు ఎలా ఉంటుంది, ఉండకపోవచ్చు అని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు.
ఆలస్యంగా ప్రారంభమైన సహాయక చర్యలు
నానక్‌రాంగూడలో జరిగిన ప్రమాదం తర్వాత సహాయక చర్యలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. పెద్ద శబ్దంతో భవనం కూలిన తర్వాత స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, జిహెచ్‌ఎంసి, అగ్నిమాపక శాఖ అధికారులు తొలుత కరెంట్ సరఫరా నిలిపివేశారు. గ్రామం మొత్తం కూడా రెండు గంటల పాటు గాఢ అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆలస్యం జరిగింది. రాత్రి 11.30 గంటల తర్వాత రంగంలోకి దిగిన ఎన్‌డిఆర్‌ఎస్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆరు అంతస్తుల భవనం ఒకదానిపై ఒకటి కుదించుకుపోవడంతో శిథిలాల తొలగింపునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
చర్యలు తీసుకుంటాం: అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. భవనం కూలడానికి నిర్మాణ లోపమా, పక్కన నిర్మిస్తున్న మరో కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యమో పరిశీలిస్తున్నామన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రి పద్మారావు, సైబర్ కమిషనర్ సందీప్ శాండిల్య తదితరులు సంఘటనా స్థలిని పరిశీలించారు.