హైదరాబాద్

మా వారెక్కడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: నానక్‌రాంగూడలో భవనం కుప్పకూలిన ఘటన స్థలంలో మృతుల బంధువులు అధికారులు తీరు పట్ల ఒకింత ఆందోళనను వ్యక్తం చేశారు. భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు మృతులు, గాయాలపాలైన వారున్నట్లు మీడియా ద్వారా తెల్సుకున్న విజయనగరం జిల్లా బల్దిపేట్ చిలకపల్లి వాసులు హుటాహుటిన ఉదయం నగరానికి చేరుకున్నారు. వీరిలో కొందరు తమవారి కోసం ఆర్తనాదాలు చేశారు. మృతదేహాలు బయటకు తీస్తున్నపుడు ఆ ప్రాంతం రోదనలతో దద్దరిల్లింది. కానీ విజయనగరం నుంచి వచ్చిన కొందరు మృతుల బంధువులను ఘటనా స్థలానికి పోలీసులు అనుమతించలేదు. ఏడాది కాలంగా ఇదే భవనంలో తమ బంధువుల పనిచేస్తున్నారని వారు పేర్లు సాంబయ్య, గౌరీశ్వరి, పైడమ్మ, కోలినాయుడు, విల్లు శంకర్‌రావులున్నారని పేర్లు చెబుతూ, తమవారు శిథిలాల్లో చిక్కుకున్నారంటూ రోదిస్తూ మొరబెట్టుకున్నా, పోలీసులు వారిని భవనం కూలిన ప్రదేశానికి అనుమతించలేదు. కేవలం చిలకపల్లి గ్రామానికి చెందిన వారు చనిపోయి ఉన్నారని, వారి మృతదేహాలను వాహనాల్లో తీసుకెళ్తున్నారని, కానీ చూసేందుకు తమని అనుమతించటం లేదని ఘటనా స్థలానికి చేరుకున్న చిలకపల్లి గ్రామస్తులు వాపోయారు. చివరకు సహనం నశించి ఇందులో కొందరు మున్సిపల్ మంత్రి కెటిఆర్‌ను ఆశ్రయించగా, ఆసుపత్రిలో ఉంచి మృతదేహాలను, చికిత్స నిమిత్తం చేర్పించిన వారిని గుర్తించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చిలకపల్లి గ్రామస్తులు వాపోయారు. కానీ భవనం కుప్పకూలినప్పటి నుంచి కూడా ఘటన స్థలానికి ఒక కారు కూడా వెళ్లలేని పరిస్థితి. పైగా కూలినప్పటి నుంచే అమాత్యులు, వివిధ రాజకీయపార్టీల నేతలు వరుసగా సందర్శిస్తుండటంతో అంతా హడావుడి నెలకొంది. గురువారం రాత్రి భవనం కూలిన వెంటనే గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్న రాజకీయ నేతలను పోలీసులు ఘటనా స్థలం వరకు అనుమతిస్తూ, కొందరు మీడియా ప్రతినిధులను పంపేందుకు నిరాకరించారు.
ఏపి ప్రభుత్వం చేయూత
రాజేంద్రనగర్: భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వనుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వారు ఉండటంతో ఏపి ప్రభుత్వం స్పందించింది. సంఘటనా స్థలానికి ఏపి గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని, బొబ్బిలి ఎమ్మెల్యే సుజనా కృష్ణరంగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవి శుక్రవారం వచ్చారు. మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి మృణాళిని ప్రకటించారు.
ఘటన విషయం తెలిసిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ యువనాయకులు కార్తీక్‌రెడ్డి సందర్శించి ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెంటనే పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.