హైదరాబాద్

‘వెంటాడే వాక్యాలు’ గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జనవరి 31: ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీ రచించిన ‘వెంటాడే వాక్యాలు’ గ్రంథావిష్కరణ సభ వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. ఈసందర్భంగా డా.ద్వానాశాస్ర్తీ ‘శతక సాహిత్యం-వ్యక్తిత్వ వికాసం’ 8 శతకాలపై 188 నిమిషాల నిర్విరామ ప్రసంగం చేశారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ శతక సాహిత్యం విశిష్టమైనదని తెలిపారు. 12వ శతాబ్దంలో ప్రారంభమైన శతక ప్రక్రియ నేటివరకు కొనసాగడం ఎంతో విశేషమన్నారు. శతక సాహిత్యం తెలుగువారి పెన్నిధిగా పేర్కోన్నారు. తొలి శతకమైన వృషాధిపశతకంతో మొదలు పెట్టి నేటి సెల్‌ఫోన్ శతకం వరకు వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదం చేశాయో ఎనిమిది శతకాల ఆధారంగా ద్వానాశాస్ర్తీ విశే్లషించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సభకు ముందు ప్రముఖ గాయనీ సీతామహాలక్ష్మీ మోహన రాగంలో అలపించిన సినీ సంగీత విభావరి అందరినీ అలరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు చిలుకూరు రంగరాజన్, ప్రజాకవి గోరటి వెంకన్న, నేటి నిజం సంపాదకులు బైస దేవదాసు, రచయిత్రి డా.ముక్తేవి భారతి, చిక్కాదేవదాసు, డా.పల్లేరు వీరాస్వామి, వంశీ సంస్థల అధ్యక్షుడు వంశీరామరాజు, డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.

కె.మలయవాసినికి
సాహితీ పురస్కార ప్రదానం
కాచిగూడ, జనవరి 31: కందుకూరి రామభద్రరావు 111వ జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత్రి డా.కె.మలయవాసినికి సాహితీ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డా.బులుసు శివశంకరరావు పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య అభివృద్ధికి కందుకూరి రామభద్రరావు చేసిన సేవలను కొనియడారు. సాహిత్య విశిష్టతను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సభకు ముందు డా.కెవి.రమణమూర్తి బృందంచే లలిత సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. సమాచారహక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డా.కెబి.లక్ష్మీ, కందుకూరి పుండరీకాక్షుడు, డా.వోలేటి పార్వతీశం, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా. ఆర్.ప్రభాకర్‌రావు, మద్దాళి రాఘురామ్, ప్రపంచ రికార్డుల గ్రహిత డా.కళావేంకట దీక్షితులు పాల్గొన్నారు.

భక్తి పారవశ్యంతో త్యాగరాజ ఆరాధనోత్సవం
ముషీరాబాద్, జనవరి 31: వాగ్దేవీ సంగీత విద్యాలయం నిర్వాహకులు తాడేపల్లి ఉమాశంకర్, సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. పలువురు సంగీత విద్వాంసులు, ఔత్సాహిక కళాకారులు, విద్యార్ధులు సంగీతోత్సవంలో పాల్గొని త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తలను ఆలపించారు.
శ్రీచక్ర సిమెంట్స్ అధినేత కృష్ణకుమార్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు వాసా గోపీనాథ్, నేతి వెంకటరమణ శర్మ, ఉమాశంకర్, మంథా శ్రీనివాస్, టీకే సిస్టర్స్ సరోజ, సుజాత, సీతామహాలక్ష్మి, శారదారెడ్డి గాత్రంతో రమణమూర్తి, శశిభూషణ్, సుబ్బలక్ష్మి వయొలిన్‌పై, సుధాకర్, ఉదయవాణి వీణవాద్యంతో, వేణువుపై దత్తాత్రేయ, వి.నాగరాజు త్యాగరాజు కీర్తనలను రక్తి కట్టించారు. ప్రభుత్వ సంగీత నృత్య కశాశాల అధ్యాపకులు రాజగోపాలచారి, విజయకుమార్ మృదంగంతో సహకరించారు. ప్రముఖ నాట్యాచార్యుడు కళాకృష్ణ శిష్యులు ఆంధ్రనాట్యంతో కుమారి మణిదీప భరతనాట్యంతో ఆహుతులను అలరించారు.