హైదరాబాద్

అక్రమ నిర్మాణాల కొత్త చట్టానికి ఆది నుంచే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: జిహెచ్‌ఎంసి అనుమతులుండి, అనుమతుల్లేకుండా కొనసాగుతున్న ప్రతి నిర్మాణాన్ని సర్కిళ్ల వారీగా గుర్తించేందుకు అధికారులు బృందాలను సిద్ధం చేస్తున్నారు. తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి, అసలు అనుమతుల్లేకుండా కొనసాగుతున్న భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్త చట్టాన్ని అమలు చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తుండగా, ఆదిలోనే కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇటీవల నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలి పదకొండు మంది కూలీలు దుర్మరణం పాలైన ఘటనలు వరుసగా చోటుచేసుకోవటంతో అధికారులు అక్రమ, సక్రమ నిర్మాణాల్లో అన్నింటిపై నిఘా పెట్టడటంతో పాటు అక్రమ నిర్మాణాలు జరిగినా, తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు కొనసాగినా, అందుకు స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారులను బాధ్యులను చేసేందుకు వీలుగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని జిహెచ్‌ఎంసి ప్రయత్నాలు చేస్తోంది. అంతేగాక, అక్రమ నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడి, నానక్‌రాం గూడలోజరిగిన ఘటనలు సంభవించి సామాన్యులు ప్రాణాలు కోల్పోతే సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులను బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసులను కూడా నమోదు చేసేలా, అవసరమైతే కొన్ని సందర్భాల్లో బాధ్యులను జైలుకు పంపేలా ఈ కొత్తచట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెల్సుకున్న కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవటంలో భాగంగా పాలకవర్గం పెద్దలను కలిసి వత్తిడి చేసినట్లు తెలిసింది. అంతేగాక, సచివాలయం స్థాయిలో కూడా పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. అంతేగాక, టౌన్‌ప్లానింగ్‌లో అవసరానికి తగిన విధంగా సిబ్బంది లేకపోవటం, అవసరమైన మొత్తం సిబ్బందికి కేవలం మూడో వంతు ఉన్న తాము ఎంతో పనిభారంతో పనిచేస్తున్నామని పాలక మండలికి, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఎవరో కొందరు అక్రమాలకు పాల్పడి ఉండవచ్చునని, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే తమను బయపెట్టించేలా ఇంతటి ఖచ్చితమైన చట్టాలను తీసుకువస్తే తామెలా పనిచేసేదని కొందరు మేయర్‌కు మొరపెట్టుకోగా, టౌన్‌ప్లానింగ్ విభాగంలో సక్రమంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించే వారితో పాటు అక్రమాలకు పాల్పడే వారు కూడా ఉన్నట్లు సమాచారం ఉందని, పటిష్టమైన చట్టాలు తీసుకురావద్దని కోరే అధికారులు ఆ అక్రమార్కుల పేర్లను బయటపెడితే, వారిపైనే చర్యలను పరిమితం చేస్తామని వ్యాఖ్యానించటంతో పాలక వర్గం, ఇతర ఉన్నతాధికారులపై వత్తిడి తెచ్చిన అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

యోగా విజ్ఞానాన్ని బోధించాలి
ఖైరటాబాద్, డిసెంబర్ 18: సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పాటునిచ్చే యోగా శాస్త్రాన్ని కెజి నుంచి పిజి వరకు బోదించాలని తెలంగాణ యోగా మాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆనంద్ యోగా భారత్, క్యాలెండర్‌ను సొసైటీ అధ్యక్షుడు వెంకట్ ఆవిష్కరించారు. యోగాకు పుట్టినిల్లు అయిన భారత్ దేశంలో యోగాకు ఆధారణ లభించక పోవడం ఎంతో ఆవేదన కలిగించే అంశం అన్నారు. యోగాను సాధన చేస్తూ విదేశియులు ఆరోగ్యంగా జీవిస్తుండగా ఇక్కడి వారు అనారోగ్యాలతో బాధపడటం విచిత్రంగా ఉందన్నారు. యోగాకు బహుళ ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు యోగా భారతాన్ని నిర్మించే లక్ష్యంతో ఈ సొసైటీని ఏర్పాటు చేశామని తెలిపారు. తమ లక్ష్యాలకు ప్రభుత్వం సహకారాన్ని అర్దిస్తున్నట్టు చెప్పారు. గ్రామ, పట్టణ స్థాయిల్లో ఉచిత యోగా కేంద్రాలను ప్రభుత్వమే అన్ని వసతులతో ఏర్పాటు చేయాలని కోరారు. యోగా సాధకులను యోగా వాలంటీర్లగా గుర్తించి వీరికి ప్రభుత్వం గౌరవ భృతిని కల్పించాలని కోరారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న యోగాకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలోజయరామ్‌రెడ్డి, శ్రీనుబాబు, గోపినాద్, సత్యనారాయణ, నర్సింహులు, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.